భరత్ కు చుక్కలు చూపిస్తున్న సీనియర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భరత్ కు చుక్కలు చూపిస్తున్న సీనియర్లు

విశాఖపట్టణం, మార్చి 27 (way2newstv.com)
విశాఖలో ఈసారి ఎంపీ అభ్యర్ధులో ఒకరు తప్ప అంతా కొత్త వారే బరిలో దిగుతున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ, టీడీపీ నుంచి దివంగత ఎంపీ మూర్తి గారి మనవడు, నందమూరి బాలకృష్ణ శ్రీ భరత్, జనసేన నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంతా రాజకీయాలకు కొత్త వారే. దీంతో సీనియర్ల ర్యాగింగ్ జూనియర్లకు తప్పడంలేదు. ముఖ్యంగా వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కొన్ని ఇబ్బందులు ఉన్నా వయసు అనుభవం రిత్యా సర్దుకుంటున్నారు కానీ కేవలం ముప్పయి ఏళ్ళ వయసులో ఎంపీ టికెట్ సాధించిన శ్రీ భరత్ మాత్రం సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల ముందు తేలిపోతున్నారట. ఆయన్ని తమ డిమాండ్లతో ఎమ్మెల్యే అభ్యర్ధులు ఆడించేస్తున్నారు.


 భరత్ కు చుక్కలు చూపిస్తున్న సీనియర్లు

నిన్నటి వరకూ జిల్లా రాజకీయాలను సాధించిన ఓ సీనియర్ నేత అయితే అంతా తాను చెప్పినట్లే జరగాలని ఈ ఎంపీ క్యాండిడేట్ ని కట్టడి చేస్తున్నారుట. ఇక మరో సీనియర్ నేత, ఆఖరు నిముషంలో టికెట్ సాధించుకున్న అభ్యర్ధి అయితే తన ఎన్నికల ప్రచార బాధ్యత, నిధుల వ్యవహారం మొత్తం ఈ ఎంపీ అభ్యర్ధి మీదనే పెట్టేస్తున్నారట. అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా పైసా వసూల్ అంటున్నారుట. ఇక మరో ఎమ్మెల్యే అయితే తన అసమ్మతి కధలన్నీ ఈ కుర్ర ఎంపీ ముందుంచి తీర్చక‌పోతే నీకూ నాకూ ఇద్దరికీ ఓట్లు రావంటూ బెదిరిస్తున్నారుట.ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీలో ఈమారు సిట్టింగులే మళ్ళీ టికెట్లు దక్కాయి. దాంతో ఆశావహులు, అసమ్మతి స్వరాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వారంతా ఈ ఎంపీ క్యాండిడేట్ నే తగవులు తీర్చమంటున్నారుట. సహజంగా ఎంపీ, ఎమ్మెల్యే రెండూ కలిపి ఒకేమారు ఎన్నికలు జరిగితే ఎంపీ ఎక్కువ బాధ్యత వహిస్తారు. నిధుల సహకారం వంటివి చూస్తారు. అయితే సీనియర్ నాయకుడు ఎంపీ క్యాండిడేట్ గా ఉండడం వల్ల అన్నీ సర్దుబాటు చేసుకుంటారు. ఇక్కడ ఏ మాత్రం అనుభవం లేని భరత్ రంగంలో ఉండడం వల్ల ఎమ్మెల్యే అభ్యర్ధులు చిత్తం వచ్చినట్లుగా రెచ్చిపోతున్నారని అంటున్నారు. అయితే బాబుతో దగ్గర చుట్టం ఉన్న ఈ కుర్ర ఎంపీ అభ్యర్ధి ఎప్పటికపుడు సీన్ చెప్పేస్తున్నారుట. ఆ పైన హై కమాండ్ రంగంలోకి దిగితే దారికి వస్తారో లేక పుట్టె ముంచుతారో చూడాలి మరి.