పారదర్శకంగా ఎన్నికలను నిర్వహిస్తాం : కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పారదర్శకంగా ఎన్నికలను నిర్వహిస్తాం : కలెక్టర్

 కర్నూలు, మార్చి 19 (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు.  మంగళవారం  కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎంల గోదాములో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ జిల్లా ఎన్నికల అధికారి ఆద్వర్యంలో జరిగింది.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఏ  నియోజకవర్గానికి ఏ నంబర్లు గల బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్స్  కేటాయింపును కంప్యూటర్ ద్వారా మీ సమక్షంలోనే నిర్దారణ చేస్తామన్నారు.  


పారదర్శకంగా ఎన్నికలను నిర్వహిస్తాం : కలెక్టర్

ఆన్ లైన్ లో కేటాయించిన ఈవీఎంల ను అభ్యర్థులు నామినేషన్ దాఖలు, స్క్రుటినీ, ఉప సంహరణ పూర్తి అయిన తరువాత  పోటీలో ఉన్న అభ్యర్థుల ఖరారు కాగానే  సంభందిత నియోజకవర్గంలోని పోలింగ్ బూతుల వారీగా మరోసారి ర్యాండమైజేషన్ చేసి బూతుల వారీగా ఈవీఎంలను  తరలించడం జరుగుతుందన్నారు.  ఈవీఎంలను కేటాయించిన దానికంటే బ్యాలెట్ యూనిట్ 30 శాతం, కంట్రోల్ యూనిట్ 15 శాతం, వివి ప్యాట్స్ 15 శాతం అధికంగా సిద్ధంగా ఉంచుకుంటామన్నారు.   ఎన్నికల వ్యయ పరిశీలకులు యషేన్ దేర్ గార్గ్,  నటేష్ లు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో వెంకటేశం, హౌసింగ్ పీడి వెంకటేశ్వర రెడ్డి, సీపీవో ఆనంద నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.