విశాఖలో అద్వాన్నంగా పారిశుద్ధ్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖలో అద్వాన్నంగా పారిశుద్ధ్యం

విశాఖపట్టణం మార్చి 8, (way2newstv.com)
జివిఎంసి ఆరో వార్డు పరిధిలోని సాగర్‌నగర్‌ వుడా కాలనీలో పారిశుధ్యం అధ్వానంగా తయారయింది. ఎక్కడ చూసినా కాలువలు నిండి చెత్త ఎక్కడికక్కడే ఉండిపోయింది. మరోవైపు దోమలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ఇప్పటికే రోగాల బారిన పడ్డారు. తాడిచెట్లపాలెం రహదారి పక్కన మురుగు నీరు పోయేందుకు ఎలాంటి కాలువలూ లేవు. 


విశాఖలో అద్వాన్నంగా పారిశుద్ధ్యం

చెత్తా చెదారంతో కాలువ నిండి పోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాపించి చాలా మంది మలేరియా, టైఫాయిడ్‌ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. విశాఖను స్వచ్ఛంగా తీర్చిదిద్దుతామంటున్న అధికారులకు శివారు ప్రాంతాలు కానరావడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెత్తను పడేసేందుకు డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో తెలియడం లేదని చెబుతున్నారు. సాగర్‌నగర్‌లో కాలువల మీద పలకలు లేకపోవడంతో చిన్నారులు గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా కమిషనర్‌ స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.