ముందుకు సాగని వాయుసేన పనులు

అదిలాబాద్, మార్చి 29, (way2newstv.com)
అదిలాబాద్‌ పట్టణ శివారులో ఉన్న వాయుసేన స్థలంలో ఎయిర్‌స్ట్రిప్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రెండుమార్లు ప్రకటించారు. ఇది ఒక మినీ ఎయిర్‌పోర్టులా ఉంటుంది. ప్రస్తుతం పట్టణ శివారులో 369 ఎకరాల భూమి వాయుసేన ఆధీనంలో ఉంది. ఎయిర్‌స్ట్రిప్‌ కేంద్రం ఏర్పాటుకు ఈ భూమి సరిపోనుంది. కేంద్రం ఏర్పాటైతే ఆదిలాబాద్‌కు విమాన రాకపోకలు మొదలవుతాయి. దేశంలో ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లే విమానాలు ఆదిలాబాద్‌ మీదుగా వెళ్తాయి. ఇక్కడి వారికి హైదరాబాద్‌, ముంభై, డిల్లీ ఇతరత్ర నగరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశమేరప్పడుతుంది. దీనివల్ల వ్యాపారపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు మార్గం ఏర్పడుతుంది. పారిశ్రామిక వేత్తలు వచ్చేందుకు వీలుండడం వల్ల కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. 


ముందుకు సాగని వాయుసేన పనులు

ప్రభుత్వ పరంగా ఆదిలాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకానుండంతో హైదరాబాద్‌ నుంచి వైద్యులు రాకపోకలు  సులువుకానున్నాయి.వాయుసేనకు ఇక్కడ విశాలమైన స్థలం ఉండడంతో శిక్షణ కోసం వైమానిక దళ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం వాయుసేనకు ఉన్న 369 ఎకరాలకు తోడు చుట్టుపక్కల 1597 ఎకరాల ప్రైవేటు భూమిని గుర్తించారు. సర్వే నాలుగేళ్ల కిందటే పూర్తైంది. దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈ ప్రాంతంలోని రైతులు అయోమంలో ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం  ఎన్‌ఓసీ ఇవ్వకపోవడంతోనే శిక్షణ కేంద్రం ఏర్పాటు కావడం లేదు. దీనిపై రాష్ట్రప్రభుత్వం తరపున ఎలాంటి సమాధానంలేదు. దీన్నిపక్కనబెట్టి ఎయిర్‌స్ట్రిప్‌ ఏర్పాటుచేస్తామని చెప్పడం.. అది వాయుసేన భూమి కావడంతో.. వాయుసేన అధికారులు అనుమతి ఇస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వైమానిక దళ శిక్షణ కేంద్రం కోసం రాష్ట్రప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇవ్వనుందుకు వారు ఎయిర్‌స్ట్రిప్‌కు ఎలా అనుమతి ఇస్తారా? అనేది సందేహాస్పదంగా మారింది.
Previous Post Next Post