మహబూబ్ నగర్, మార్చి 29 (way2newstv.com)
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటూ... నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. నాగర్ కర్నూల్ ఎంపీ సీటు రిజర్వ్ కావడంతో... అక్కడ ఎస్సీ అభ్యర్థికి కేటాయిస్తూ వస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జనరల్ కోటా కింద చేర్చారు. టీఆర్ఎస్ ప్రభావం ఉన్నప్పటికీ... నాగర్ కర్నూలులో కాంగ్రెస్‌కి చెందిన నంది ఎల్లయ్య ఎంపీగా విజయం సాధించారు.
పాలమూరు జేజేమ్మ గురి కుదురుతుందా...
మహబూబ్‌నగర్ నుంచీ టీఆర్ఎస్ తరపున పోటీచేసిన జితేందర్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీని కాదని పార్టీ అధినే కేసీఆర్... మైలాన్ పరిశ్రమల అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి తమ్ముడు మన్నె శ్రీనివాస్ రెడ్డికి బి - ఫారం ఇచ్చారు. జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగింది.మహబూబ్‌నగర్‌లో 1952 నుంచి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. 14,18,672 మంది ఓటర్లున్నారు. కొత్తగా మరి కొంత మంది అదనంగా చేరారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులే అన్ని చోట్లా గెలిచారు.