కర్నూలు,మార్చి 25 (way2newstv.com)
ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఆర్వోలు, ఏర్వోలు, జిల్లా నోడల్ అధికారులు, తహాశీల్దార్లు, యంపిడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల విధులకు నియమించిన పివోలు, ఎపీఓలకు ఆదివారం నాడు నిర్వహించిన శిక్షణా తరగతులకు చాలా మంది హాజరుకాకాపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎన్నికల విధులకు హజరుకాకపోతే కఠిన చర్యలు
హాజరుకాని వారందరికీ నేడు సాయంత్రం శిక్షణా తరగతులను నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనికి కూడా హాజరు కాకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ల పరిశీలన 26 న జరుగతుందన్నారు. నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్ధుల నామినేషన్లను పరిశీలన చేయాలన్నారు. ఓటర్ల క్యూ లైన్లను సరిగా నిర్వహించేందుకు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వారిని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో వెంకటేశం, సిపిఓ ఆనంద్ నాయక్, డిఆర్.డిఏ పీడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.