బీజేపీలో జితేందర్ రెడ్డి చేరిక దేనికి సంకేతం ? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీలో జితేందర్ రెడ్డి చేరిక దేనికి సంకేతం ?

హైదరాబాద్ మార్చ్ 28 (way2newstv.com)
జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో రెండు కులాల పార్టీగా మిగిలి పోయేందుకు శరవేగంగా దూసుకుపోతున్నది.  తెలంగాణ బీజేపీలో ఇప్పటికే సుమారు ఇరవై ప్రాధాన్యత కలిగిన పదవులతో వెలమ కుల ఆధిపత్యం కొనసాగుతుండగా, గతంలో ఈ పార్టీ రెడ్డి కుల వాళ్ళతో నిండిపోయి ఇతర కులాల వారిని అణిచివేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం, టీఆరెస్స్ లో, రెడ్డి కుల రాజకీయాలు చేస్తూ, పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి, క్రమశిక్షణా రాహిత్యమైనవ్యక్తి,  మహబూబ్ నగర్ లోకసభ టికెట్ హామీ దక్కక కాంగ్రెస్ లో చేరలేక, గత్యంతరంలేక టీఆర్ఎస్. లోనే ఉండిపోయిన జితేందర్ రెడ్డి చేరికకు రాంమాధవ్ మంతనాలు చేయడం హాస్యాస్పదం. ఇంటినిండా, వంటినిండా రెడ్డి కుల పిచ్చి నింపుకున్న జితేందర్ రెడ్డి లాంటి వారిని చేర్చుకోవడం వల్ల బీజేపీకి అదనంగా ఒరిగేదేమీ లేదు. 


బీజేపీలో జితేందర్ రెడ్డి చేరిక దేనికి సంకేతం ? 

పైగా తనకు రాజ్యసభ టికెట్, లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టు,  తన కొడుకులకు రాజకీయ భవిష్యత్తు కు హామీ తీసుకుని పార్టీలో చేర్చుకోవాల్సిన ఖర్మ బీజేపీకి పట్టింది. గతంలో పదవులు అనుభవించి బయటకు పోయి, తిరిగి ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని బీజేపీలో చేరాడు. తప్పితే బీజేపీ ఓడిపోతుందంటే ఆవైపు కన్నెత్తి చూసే రకం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలు ఓట్లు వేయాలి. పదవులు మాత్రం వెలమ, రెడ్డి కులాలకు కట్టబెట్టే బీజేపీ లాజిక్కేంటో ఆ పార్టీ నాయకులే చెప్పాలి. రెడ్ల పార్టీగా ఉన్న కాంగ్రెస్, వెలమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కు బీ టీమ్ పార్టీగా తెలంగాణ బీజేపీ తయారైంది. ఇటువంటి పార్టీకి మిగతా కులాల ఓటర్లు ఓట్లెందుకు వెయ్యాలో ఆ పార్టీయే చెప్పాలి. రెడ్ల పార్టీగా ఉన్నందుకు కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తూ, ప్రత్యామ్నాయం లేక టీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ బీ టీం అయినందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 5 నుంచి ఒకటికి కుదించుకుపోయింది. ఈ రెడ్డి కుల పిచ్చిగాళ్ళ వల్ల పార్టీకి లాభమా ? పార్టీ వల్ల ఈ కుల పిచ్చిగల వారికి లాభమా ? అనే విషయాన్ని బేరీజు వేసుకుంటేనే, నరేంద్ర మోదీ గారికి అనుకూలంగా ఉన్న తెలంగాణ ఓటర్లు, తమ ఓట్లను బీజేపీవైపునకు మళ్ళిస్తారు. లేని పక్షంలో బిజెపి పని అంతే!