గుంటూరు, మార్చి 19, (way2newstv.com)
రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి రెండు నెలల కిందటే హైకోర్టు రాజధాని అమరావతికి తరలిం చారు. ఇప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును నిర్వహిస్తున్నారు. ప్రస్తుత అవసరం మేరకు కోర్టు హాళ్లు సిద్ధం చేయటంతో నూతన భవనాలలోనే హైకోర్టు కార్యకలాపాలు జరగనున్నాయి. హైకోర్టుకు సంబంధించిన రికార్డులన్నీ దాదాపుగా అమరావతికి చేరుకున్నట్లు న్యాయవర్గాలు పేర్కొన్నాయి. రాజధానిలో హైకోర్టుకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించనుంది. రాకపోకలపై ఆంక్షలు.. జ్యూడిషియల్ కాంప్లెక్స్ ప్రారంభమవుతున్నందున కరకట్ట రోడ్దులో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు రాజశేఖర్‌బాబు, విజయరావు తెలిపారు.
అమరావతి హైకోర్టు నుంచే కార్యాకలాపాలు
హైకోర్టు జడ్జీలు, రిజిస్ర్టార్‌లు, అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు, గవర్నమెంట్ ప్లీడర్లు, అడ్వొకేట్‌లు, హైకోర్టు సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య కరకట్టమీదుగా ప్రయాణించి హైకోర్టుకు చేరుకోవాలని సూచించారు. ఆ సమయంలో కరకట్టమీద ఎదురుగా వా హనాలు అనుమతింప బడవన్నారు. ఆ సమయంలో ఆయా వాహనాలు కృషాణయపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా విజయవాడ చేరుకోవాలని కోరారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు హైకోర్టు జడ్జీలు, రిజిస్ర్టార్‌లు, అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు, గవర్నమెంట్ ప్లీడర్లు, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎంఎస్‌ఆర్ ఆశ్రమం, కరకట్ట మీదుగా ప్రయాణించి లోటస్ హోటల్ మీదుగా గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరారు.హైకోర్టు అడ్వొకేట్‌లు, హైకోర్టు సిబ్బంది సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎంఎస్‌ఆర్ ఆశ్రమం, కరకట్ట మీదుగా ప్రయాణించి అప్పారావు చెక్‌పోస్టు వద్ద దిగువకు దిగి ఉండవల్లి గుహల మీదుగా స్ర్కూ బ్రిడ్జి చేరుకుని వారి గమ్య స్ధానాలకు చేరుకోవాలని కోరారు. ఈ సమయంలో లోటస్ హోటల్ నుంచి కరకట్టమీదుగా వాహనాలు అను మతించబడవు. వారు ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా వారివారి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. వాహనదారుల సౌకర్యార్థం సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు అర్బన్, రూరల్ ఎస్పీలు విజయరావు, రాజశేఖర్‌బాబులు తెలిపారు. ఎవరికైనా సమస్య ఏర్పడితే తాడేపల్లి సీఐ వై.శ్రీనివాసరావును 9440796271, తుళ్లూరు ట్రాఫిక్ సీఐ ఐ.వెంకటేశ్వరరెడ్డిని 6305957989, లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు