కొండపాక, మార్చి 27 (way2newstv.com)
సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన కొండపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాము ఎఫ్ఎల్సీ ఫస్ట్ లెవల్ చెకప్ రూమ్ లో భద్రపర్చిన ఈవీఏం మిషన్లను బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. ఈవీఎం మిషన్లు, వీవీ ప్యాట్స్, తదితర ఎన్నికల ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా భద్రపరుస్తున్న తీరును డీఆర్ఓ చంద్రశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్, దుబ్బాక, సిద్ధిపేట, హుస్నాబాద్ నియోజకవర్గాలలోని పలు మండలాల తహశీల్దార్లు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఈవీఏం మిషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్