సబితా, కార్తీక్ డుమ్మా వెనుక రీజనేంటి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సబితా, కార్తీక్ డుమ్మా వెనుక రీజనేంటి

హైద్రాబాద్, మార్చి 7, (way2newstv.com)
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా వారికి ఫోన్ చేశారు. కార్తీక్ రెడ్డికి ఫోన్ చేసి వెంటనే గాంధీభవన్‌కు రావాల్సిందిగా కోరారు. రాహుల్ గాంధీ ఈనెల 9న తెలంగాణలో పర్యటించనున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పహాడీ షరీఫ్‌లో ఓ బహిరంగ సభను నిర్వహించాలనుకున్నారు. 


 సబితా, కార్తీక్ డుమ్మా వెనుక రీజనేంటి

అయితే, అక్కడ వారికి అనుమతి రాకపోవడంతో శంషాబాద్‌కు సమావేశాన్ని తరలించాలని టీ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు.సబితా ఇంద్రారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం టికెట్ కోసం చివరి వరకు పోరాడారు. అయితే, పొత్తుల్లో భాగంగా రాజేంద్రనగర్ టికెట్‌ను కార్తీక్ రెడ్డికి కాదని.. టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో కార్తీక్ రెడ్డి అలిగారు. అయితే, పెద్దలు బుజ్జగించారు.కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి సమయంలో సబితా ఇంద్రారెడ్డి సమావేశానికి హాజరుకాకపోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది.