రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం,మార్చి 5, (way2newstv.com)
ప్రకాశం జిల్లా  దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్డు చింతల సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మంగళవారం ఉదయం ఘాట్ రోడ్డుపై వేళుతున్నల బోలెరో వాహనా  మలుపు వద్ద కారును ఓవర్ టేక్ చేయబోయి బోల్తా పడింది. ఆ సమయంలో బొలెరో లో ఇరవైమంది  ప్రయాణిస్తునట్లు సమాచారం.  ఘటనలో ఇద్దరు  అక్కడికక్కడే మృతి చెందగా పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.  ఐదుగురికి  స్వల్ప గాయాలు తగిలాయి. 


రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రయాణికులంతా శివ రాత్రి సందర్భంగా శ్రీ శైలం మల్లికార్జున స్వామి ని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు నర్సింహాచారి, అయన  భార్య సుమలత. మృతులది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఉప్పలపాడు గ్రామమని పోలీసులు వెల్లడించారు. 
Previous Post Next Post