కలెక్షన్లతో కొల్లగొడుతున్న చీకటి గదిలో చితక్కొట్టుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కలెక్షన్లతో కొల్లగొడుతున్న చీకటి గదిలో చితక్కొట్టుడు

హైద్రాబాద్, మార్చి 23, (way2newstv.com)
చీకటి గదిలో చితక్కొట్టుడు.. బూతు కంటెంట్‌ను దండిగా దట్టించి తెలుగు ప్రేక్షకుల పైకి వదిలిన సినిమా ఇది. గురువారం (మార్చి 21) విడుదలైన ఈ సినిమా ఓ వైపు వివాదాలు నడుస్తుండగానే.. మరోవైపు కలెక్షన్లు కొల్లగొడుతోంది. టైటిల్ సహా సినిమా మొత్తం పచ్చి బూతులతో నింపేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రదర్శనను నిలిపేయాలని మహిళా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సాగర నగరం విశాఖపట్నంలోనూ ఈ చిత్ర ప్రదర్శనకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా ప్రదర్శిస్తున గాజువాకలోని లక్ష్మీకాంత్ థియేటర్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన మహిళలు సినిమా ప్రదర్శన తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. 


కలెక్షన్లతో కొల్లగొడుతున్న చీకటి గదిలో చితక్కొట్టుడు

సినిమా పోస్టర్లు చించివేసి నిరసన తెలిపారు. యువతను పెడదారి పట్టించే అశ్లీల చిత్రాలను వెంటనే నిలిపివేయాంటూ థియేటర్ ఎదుట నినాదాలు చేశారు. థియేటర్ నుంచి వెంటనే సినిమా తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారనీ మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి. ‘మహిళలు మనోభావాలను దెబ్బ తీసేలా సినిమాలు తీస్తున్నారు. యువతను పెడదోవ పట్టించే ఇలాంటి చిత్రాలపై వెంటనే నిషేధం విధించాలి’ అని ఐద్వా నాయకురాలు పద్మ డిమాండ్ చేశారు. మహిళా సంఘాల ఆందోళనతో గాజువాక లక్ష్మీకాంత్ థియేటర్‌లో శనివారం (మార్చి 23) మార్నింగ్ షోను నిలిపి వేశారు.తమిళంలో ఇటీవల విడుదలైన ‘ఇరట్టు అరాయిల్ మురట్టు కుత్తు’ అనే సెక్స్ హారర్ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమాను ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఆర్జే హేమంత్, అరుణ్ ఆదిత్ హీరోలుగా.. నిక్కీ టాంబోలి, భాగ్యశ్రీ మోటే లాంటి ఆరేసే అందగత్తెలతో ఈ సెక్స్ రీమేక్‌ను రూపొందించారు. టీజర్‌, ట్రైలర్‌తోనే బాబోయ్ ఇదేం సినిమారా దేవుడా అనిపించాడు దర్శకుడు సంతోష్ పి. జయకుమార్. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు కొదవే లేదు. ఇప్పటి వరకూ వెండితెరపై వినకూడని, చూడకూడని డైలాగ్‌లు నింపేశారు. ‘నీకు ఎవర్ని చూసినా వస్తాది వైబ్రేషన్ ఫ్యాంట్‌లో.., నెల రోజులు హోల్‌లో ఏం పెట్టలేదు.. రంధ్రం మూసుకుపోయింది, ఇంత వరకూ తినలేదు ఇప్పుడే తినాలనిపిస్తుంది పళ్లూ, నాకూ చేతులు కట్టేసి చేస్తే చాలా ఇష్టం, ఒరేయ్ నాకు పెద్దగా ఉంటేనా చాలా ఇష్టం’ లాంటి బూతు డైలాగ్‌లు చాలానే ఉన్నాయి సినిమాలో. ఇక సన్నివేశాలు, అశ్లీలత లాంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫ్యామిలీస్ ఎవరూ ఈ చిత్రాన్ని చూడకండి.. ఇది కేవలం యూత్‌కి మాత్రమే.. అంటూ చిత్ర బృందం ముందే హెచ్చరికలు పంపడం గమనార్హం.