పశువైద్య భవనాల అభివృద్ధి పనులపై సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పశువైద్య భవనాల అభివృద్ధి పనులపై సమీక్ష

హైదరాబాద్ మార్చ్ 4  (way2newstv.com)
తెలంగాణా రాష్ట్ర పశువైద్య భవనాల అభివృద్ధి పనులపై అన్ని జిల్లాల పశువైధ్యాధికారులు, అన్ని జిల్లాల పంచాయతిరాజ్ ఇంజనీర్లతో పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య విభాగం సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడియో సమావేశం నిర్వహించారు. 2018-19 సంవత్సరానికి 563 పశువైద్య భవనాలకు 12 .5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల కోసం మంజూరీ చేసివాటి యొక్క నిర్మాణ పురోగతి పై  సమీక్ష నిర్వహించారు. ఇందులో 531 భవన అభివృద్ధి పనులు మొదలైనాయని, 410 భవనాల అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, మిగతా పనులు ఈ నెల 10 వ తారీకు లోపు పూర్తి చేసి బిల్లులు వెంటనే ట్రెజరీ లో దాఖలు చేయాలనీ ఆదేశించినారు. అలాగే 2019-20 సంవత్సరానికి గాను కొత్త పశు వైద్య శాల భవనాల నిర్మాణానికి& అభివృద్ధి పనులకు ప్రతిపాదన తీసుకొని, ఇంజనీర్లతో ప్రాజెక్ట్ ధర అంచనా ను రూపొందించి, సంచాలకులు, పశుసంవర్ధక శాఖ వారికి పంపాలని ఆదేశించినారు. ఇందుకు గాను 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుందని తెలిపినారు. పశువైద్య భవనాల అభివృద్ధి పనులపై సమీక్ష 

అలాగే పశు వైద్యుల నిపుణత పెంచడానికి సాంకేతికతతో పశువులలో రోగ నిర్ధారణ చేయడానికి 247.94లక్షలతో 23పశువైద్య శాలలకుఆల్ట్రాసౌండ్ స్కానర్ ఇవ్వడం జరిగిందని , మిగిలిన వాటికి  కూడాదశల వారీగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.అలాగే చేపట్టబడిన పశువైద్యశాల అభివృద్ధి పనులకు, నిర్దేశించిన రంగు వేయించి, నిర్దేశించిన సూచిక బోర్డులు పెట్టాలని,పనులు పూర్తి కాగానే ప్రతి వైద్యశాల ఫోటో తీసి పంపించాలని ఆదేశించారు.అలాగే సమావేశానికి రాష్ట్ర పంచాయతిరాజ్  చీఫ్ ఇంజనీర్ శ్రీ. జాన్ మిల్టన్ హాజరై రెండు మూడు సార్లు టెండర్ పిలిచినా అమలుకాని పనులకు శాఖ తరుఫున రూలు ప్రకారం పనులు పూర్తి చేయించాలని ఇంజనీర్లని కోరినారు.ఈ కార్యక్రమానికి కార్య నిర్వాహక ఇంజనీర్లు కూడా హాజరు అయినారు.అలాగే తెలంగాణా రాష్ట్ర పశుగాణాభివ్రుద్ధి సంస్థ కార్య నిర్వాహణాదికారి, డా. మంజువాణి గారు మాట్లాడుతూ, లింగ నిర్ధారణ చేసిన వీర్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ సంవత్సరానికి నిధులు మంజూరు అయ్యాయని,ఈ కార్యక్రమం రాష్ట్రం లోని పశు వైద్య సిబ్బంది మరియు గోపాల మిత్రుల ద్వారా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆవులలోని మాత్రు జీవ కణాలను ఎంపిక చేసి పరిణితి చెందిన అందాలను ప్రయోగ శాలలో ఫలదీకరణ చేసి పిండాల కృత్రిమ ఉత్పత్తి కొరకు నిధులు పి.వి.ఎం.ఆర్. పశు వైద్య విశ్వా విద్యాలయం, రాజేంద్రనగర్ వారికిఇవ్వ ఈ సంవత్సరం  ప్రాజెక్ట్ అమలు చేయడానికి  నిధులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. రాష్ట్రం లోని 38.5 లక్షల పునరుత్పత్తికి ఉపయోగపడే పశువులకు ఈనాఫ్ అనే యాప్ ద్వారా చెవులకు పోగులు వేసి పర్యవేక్షించడం జరుగుతుందనీ, ఇది ప్రణాళికలు రూపొందించడానికి, అమలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.రాష్ట్ర పశు సంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డా. ఎస్.రామచందర్ గారు,20 వ జాతీయ పశు గణన  పురోగతిపైఅన్ని జిల్లాల అధికారులతో సమీక్ష చేసినారు.జాతీయ పశుగణన సేకరణలో తెలంగాణా రాష్ట్రం 4 వ స్థానం లో ఉందని,80% కన్నాతక్కువ పశు గణన చేసిన జిల్లా అధికారులు ఈ నెల 12 వ తేదీ లోపు పూర్తి చేసి సంచాలకుల వారికి పంపగలరని ఆదేశించారు.పశువులలోవివిధ రకాల  వ్యాధులురాకుండా టీకాల కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే రాబోయే వేసవి కాలంలో పశువులకు వ్యాధులు రాకుండా అన్ని జిల్లాల పశు వైధ్యాదికారులువివిధ గ్రామాలలో జాగ్రత్తలు తిసుకొవాలనీ,త్రాగునీటి తొట్లు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.తెలంగాణాపశు సంవర్ధక శాఖ నుండి రాష్ట్ర గొర్రెల,మేకల ఫెడరేషన్ ఎం. డి., డా. లక్ష్మా రెడ్డి గారు ఫాల్గొన్నారు.ఈదూర దృశ్య సమావేశానికి అన్ని జిల్లాల పశువైధ్యాధికారులు, పంచాయతీరాజ్ కార్య నిర్వాహక ఇంజనీర్లు/ డిప్యుటీ  ఇంజనీర్లు వారి వారి జిల్లాల నుండి హాజరైనారు