ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కామెంట్స్ ...
మంగళగిరి, మార్చి 25: (way2newstv.com)
మంత్రి నారా లోకేష్ కు దైర్యం ఉంటే ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ లో దిగాలి. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని మంగళగిరి శాసనసభ స్థానానికి నామినేషన్ వేసిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి విమర్శించారు.
లోకేష్ కు ఓటమి భయం పట్టుకుంది
నామినేషన్ వేసిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ గా ప్రజా సేవకు ముందుకు వస్తున్నాను. సమాజంలో అన్ని పార్టీలు అవసరానికి వాడుకుని మాకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. జనసేన పార్టీ కి నేను దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పార్టీ నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదు. రానున్న కాలంలో మంగళగిరిలో నివాసం ఉంటూ ఇక్కడ ప్రజాసేవ చేస్తానని అన్నారు.