జనసేన తొలి జాబితా ఖరారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనసేన తొలి జాబితా ఖరారు

అమరావతి మార్చ్ 11 (way2newstv.com)  
సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుపై జనసేన పార్టీ దృష్టి సారించింది. ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో పలువురు అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి విడత జాబితాలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇందులో తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల స్థానాలు ఉండే అవకాశం ఉంది. ఈ జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 
జనసేన తొలి జాబితా ఖరారు

మరోవైపు పవన్‌కల్యాణ్‌తో వామపక్ష నేతలు భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేతతో చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై నేతలు ఓ నిర్ణయానికి రానున్నారు. తమకు 26 శాసనసభ, 4 లోకసభ స్థానాలను కేటాయించాలని వామపక్షాలు జనసేన ముందుంచాయి. ఏ నియోజకవర్గాల్లో తమకు బలముందో తెలిపే వివరాలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాయి. ఇదే సమయంలో జనసేన ఈ నెల 14న నిర్వహించబోయే పార్టీ ఆవిర్భావ సభకు ముందే అభ్యర్థుల జాబితాపై స్పష్టత ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నారు.