ఇంద్రకీలాద్రిలో కొత్త సేవలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంద్రకీలాద్రిలో కొత్త సేవలు

విజయవాడ, మార్చి 14, (way2newstv.com)  
విజయవాడ కనకదుర్గ ఆలయంలో రెండు కొత్త సేవలు ప్రారంభిస్తున్నామని ఈవో కోటేశ్వరమ్మ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.  వేకువజామున 3 గంటల నుంచి 4 గంటల.వరకు ప్రదక్షణలు అనంతరం దర్శనం  రూ.116 టికెట్,   అద్దాల మండపంలో రాత్రి 9 గంటల నుంచి 9.30 గంటల వరకు పవళింపుసేవ టికెట్  రూ.516 వుంటుందని ఆమె అన్నారు. 


 ఇంద్రకీలాద్రిలో కొత్త సేవలు

ఈ కొత్త సేవలు ఈ నెల 16 నుండి ఈ సేవలు ప్రారంభం అవుతాయని ఆమె అన్నారు.  ఉగాదిని పురస్కరించుకొని వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో రోజుకో రకం పుష్పాలతో సహస్రనామార్చనలు జరుపుతామని ఆమె అన్నారు. ఉగాది రోజు వేకువజామున 3 గంటల  మరుసటిరోజు 3 గంటల వరకు 24 గంటలపాటు లలితా సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం వద్ద వుంటుందని ఆమె అన్నారు.