హరిత శుక్రవారంలో భాగంగా రాక్గార్డెన్ సందర్శన
హైదరాబాద్,మార్చ్-01, (way2newstv.com)
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో అత్యంత విలువైన భూమి అది. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంతో రెండు అందమైన నీటి కుంటలు, పర్వత ప్రాంతం, ఎత్తైన చెట్లతో పక్షులు, సరిసృపాలతో ఉన్న ప్రాంతం అది. దాదాపు 32 ఎకరాల్లో వ్యాపించి రాక్ గార్డెన్గా పిలిచే ఈ స్థలంలో మంచి పార్కును అభివృద్ది చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ నిర్ణయించారు.
జూబ్లీహిల్స్ రాక్ గార్డెన్లో సరికొత్త ఉద్యానవనం
జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న దర్గా సమీపంలో ఉన్న ఈ 32 ఎకరాల రాక్ గార్డెన్ను నేడు హరితశుక్రవారంలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సందర్శించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, అర్బన్ బయోడైవర్సిటీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ పార్కు అభివృద్దికి ప్రణాళికలు రూపొందించి, ఎన్నికల అనంతరం నిర్మాణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రాక్ గార్డెన్ను వినూత్నంగా హైదరాబాద్ నగరంలోనే అందమైన పార్కుగా రూపొందించాలని సూచించారు. దీనితో గత ఎన్నోఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న రాక్ గార్డెన్ స్థలంలో ఆహ్లాదకరమైన, సుందర పార్కు నగర వాసులకు అందుబాటులో కి రానుంది.
Tags:
telangananews