ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు

వరంగల్ అర్బన్, మార్చ్-02, (way2newstv.com)
ఈ నెల 10 వ తేదీ ఆదివారం రోజున 5 ఏళ్ల లోపు పిల్లలందరికి  పోలియో చుక్కలు తప్పక వేయించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తో పాటుగా వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచ్చంద సంస్థలలో కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హల్ లో కమిటి సమావేశం నిర్వహించారు.


ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు

జిల్లాలోని 0-5 ఏళ్ల లోపు 97,090 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 579 పోలియో చుక్కలు కేంద్రాల ఏర్పాటు చేయటం జరుగుతుందని అయన అన్నారు. అలాగే,  38 మొబైల్ టీమ్స్, ప్రయాణంలో ఉన్నవారి కోసం ఆర్టిసి బస్టాండ్ లు,  రైల్వేస్టేషన్లు లో 27 టాన్సిట్ ఏర్పాటు చేసినట్లు,  బస్టాండ్ లు, రైల్వేస్టేషన్ ల కేంద్రాల లో 10,11,12 తేదీలలో  24  గంటలు  పనిచేస్తామని తెలియచేసారు.  
Previous Post Next Post