మోహన్ బాబుకు మద్దతు పలికిన కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి, మార్చి 22 (way2newstv.com)
తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సిగ్గుపడాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. తిరుపతిలో మోహన్ బాబు తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోగా, తన ట్విట్టర్ ఖాతాలో కన్నా స్పందించారు.
సిగ్గుండాలి చంద్రబాబూ...
"ప్రజాస్వామ్య విలువలు లేని నువ్వు 40 సం సీనియర్ అని చెప్పుకోడానికి సిగ్గుపడాలి. సినీనటుడు మోహన్ బాబు విద్యార్థుల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు తెలియచేస్తోంది. విద్యార్థుల కోసం పోరాడితే హౌస్ అరెస్ట్ చేస్తావా? ఇదేనా నీ దిక్కుమాలిన అనుభవం?" అని ఆయన ప్రశ్నించారు.