హైదరాబాద్, మార్చి 23 (way2newstv.com)
ఒక పార్టీ లో గెలిచి మరొక పార్టీ లోకి వెళ్ళడానికి సీఎం ప్రోత్సహిస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్య లేకపోతే ఈ దేశం లో ఎవరు పాలనలో భాగస్వామ్యం అయ్యేవారు కాదు. దీనిని డబ్బు బాగా ప్రభావం చూపుతుందని అయన అన్నారు. శనివారం జరిగిన పార్టీ ఫిరాయింపుల పై అఖిలపక్ష సమావేశం లో అయన మాట్లాడారు. పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో ఉన్న వనరులను ఇతర పార్టీల నాయకులను కొనడానికి వాడుతున్నారు. రిడిజైనింగ్ పెరుతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెడుతున్న డబ్బులను పక్క దారి పట్టిస్తున్నారని అయన ఆరోపించారు.
ఫిరాయింపులకు సీఎం ప్రోత్సాహం
మిషన్ కాకతీయ, సీతారామ ప్రాజెక్టు ,కాళేశ్వరం లో జరిగిన అవినీతి బయటకు రాకుండా ఉండడం కోసం ప్రశ్నించే శాసనసభ్యులు ఉండకూడదు అని ఆ అవినీతి తోనే ఎమ్మెల్యేల ను కొంటున్నారని అయన ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రం కేసీఆర్ ఎస్టేట్ గా మారుతుంది.రాష్ట్ర నిధులు ఆయన సొంత నిధులుగా మారిపోతాయని భట్టి అన్నారు. దేశ వ్యాప్తంగా అంటి డిఫెక్షన్ బిల్లు పై దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులందరితో కలిసి పోరాడతామని అయన అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, రావుల, , తదితరులు హాజరయ్యారు.