పోలవరానికి అడగుడుగునా అడ్డంకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోలవరానికి అడగుడుగునా అడ్డంకులు

ఏలూరు, మార్చి 20, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌కు జీవనరేఖ అయిన పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల ఎగువ రాష్ట్రంలోని ప్రాంతాలు ఎంతమేరకు ముంపునకు గురవుతాయో అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టు నిర్మాణం సాగకూడదని, ఒకవేళ నిర్మాణం పూర్తయినా నీటిని నిల్వ చేయకుండా నిరోధించాలని ఈ నెల 11న సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌పై ఆంధ్ర ప్రదేశ్‌ ఆశ్చర్యపోతోంది. లక్ష్యం మేరకు నిర్మాణం సాగుతున్న ప్రస్తుత దశలో దానిని అడ్డుకునేలా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసు వేసిందని ఆరోపించాయి. పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కలిగిన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టమూ లేని మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా 1980 నాటి గోదావరి జలాల వివాద ట్రైబ్యునల్‌లోని అంశాలను ఉటంకిస్తూ ఈ వ్యాజ్యంలోకి లాగడం ద్వారా ఆ రెండు రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా మాట్లాడేలా చేయాలనేది తెలంగాణ ప్రణాళికగా కనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాలను కూడా ఏపీకి వ్యతిరేకంగా మోహరించేలా చేయడం వెనుక అసలు కుట్ర వేరే ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.


పోలవరానికి అడగుడుగునా అడ్డంకులు

పైగా... ఇంకా ఎలాంటి నిర్మాణాలూ చేపట్టని భూపాలపట్నం హైడల్‌ ప్రాజెక్టు మునిగిపోతుందంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదోవపట్టించేలా వ్యాజ్యం వేసిందని అధికారులు అంటున్నారు. ప్రతిపాదిత భూపాలపట్నం హైడల్‌ ప్రాజెక్టు అభయారణ్య ప్రాంతంలో ఉందని, వన్యప్రాణి సంరక్షణ ప్రదేశంలో ఉన్నందున ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చే అవకాశమే లేదని ఒకవైపు అంగీకరిస్తూనే మరోవైపు ఈ ప్రాజెక్టు ప్రాంతం ముంపునకు గురికావడం వల్ల తమకు భవిష్యత్‌లో హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఉండదంటూ గగ్గోలు పెట్టడంలో సహేతుకత ఏంటని ఏపీ ప్రశ్నిస్తోంది. భద్రాచలం మునిగిపోతుందంటూ ఆందోళన చేయడంలోనూ అర్థం లేదని ఏపీ కొట్టిపారేస్తోంది. పోలవరం స్పిల్‌వే ఎత్తు 145 అడుగులకు మించకుండా ఉండాలని, 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి మించకుండా ఉండాలని, కానీ 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో స్పిల్‌వే నిర్మాణం చేపట్టేందుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.తెలంగాణ వ్యాజ్యంలో ఏముంది? పోలవరం ప్రాజెక్టు వద్ద గరిష్ఠ వరదను, దాని ప్రభావాన్ని అంచనాగానీ, అధ్యయనంగానీ చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం పనులు కొనసాగించడానికి ఏ విధమైన హక్కు, అర్హత లేదు. ప్రాజెక్టు వద్ద గరిష్ఠ వరద సంభావ్యతను, బ్యాక్‌వాటర్‌ ప్రభావం, సిడమెంటేషన్‌, పర్యావరణం మొదలైన అంశాలను అంచనా వేసే, అధ్యయనం చేసే బాధ్యతను పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు అప్పగించాలి. ఈ సంస్థకు నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాలకు చెందిన చీఫ్‌ ఇంజనీర్లను, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సంస్థలకు చెందిన చీఫ్‌ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక బృందాన్ని తోడ్పాటు అందించేలా ఏర్పాటు చేయాలి. 2000 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం అంచనా వేసిన ప్రభావిత ప్రాంతాలకు కట్టుబడి ఉండేలా మొదటి ప్రతివాది కేంద్ర ప్రభుత్వం, రెండో ప్రతివాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను నిర్దేశించాలి. తెలంగాణకు చెందిన మణుగూరు హెవీవాటర్‌ ప్లాంటు, భద్రాచలం దేవాలయం వంటి నిర్మాణాలకు గరిష్ఠ వరద వచ్చినప్పుడు ముంపునకు గురికాకుండా తగిన రక్షణ గోడలు నిర్మాంచేలా కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలను ఆదేశించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వహణ, నియంత్రణను స్వయం ప్రతిపత్తిగల నిపుణుల బృందానికి అప్పగించాలి. ఈ బృందంలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, పరివాహక ప్రాంత రాష్ట్రాలకు చెందిన అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులను నియమించాలి. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం గరిష్ఠ వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. పైన పేర్కొన్న అంశాలు పరిష్కారమయ్యేంత వరకూ పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేయకుండా కేంద్ర, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించాలి