స్త్రీ సాధికారతకు తమ ప్రభుత్వం ఇతోదిక కృషి: మమతా బెనర్జీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్త్రీ సాధికారతకు తమ ప్రభుత్వం ఇతోదిక కృషి: మమతా బెనర్జీ

కోల్‌కతా మార్చ్ 8 (way2newstv.com
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం లభించనప్పటికీ..తమ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.లోక్‌సభలో తమ పార్టీ నుంచి 35 శాతం సభ్యులు మహిళలే ఉన్నారని మమతా బెనర్జీ గుర్తుచేశారు. స్థానిక ప్రభుత్వాల్లోనూ 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించామని గుర్తుచేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.


 స్త్రీ సాధికారతకు తమ ప్రభుత్వం ఇతోదిక కృషి: మమతా బెనర్జీ

స్త్రీ సాధికారతకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందుకోసం ‘స్వస్థ్య సతి’ లాంటి పథకాల్ని ప్రారంభించామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని దీదీ ఇప్పటికే ప్రకటించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మహిళల ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు.