సిద్దిపేట, మార్చి 2 (way2newstv.com)
తెరాస పార్టీలో హరీష్ రావుకు కాలం చెల్లినట్లేనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఓ కేసుకు సంబంధించి సిద్దిపేట కోర్టుకు శనివారం హాజరైన రేవంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. నమ్మినవాళ్లను నట్టేటముంచడం కేసీఆర్ కు అలవాటేనన్నారు. హరీశ్ కు సిద్దిపేట ఈసారే ఆఖరని, మరోసారి టికెట్ రాదన్నారు.
టీఆర్ ఎస్ లో హరీష్‌కు కాలం చెల్లినట్టే: రేవంత్‌రెడ్డి
16మంది ఎంపీలుంటే ఏదో వెలగబెడతామంటున్నారని, ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని రేవంత్ అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చారా..? విభజన హామీలు సాధించారా? అని రేవంత్ ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీగానే కొనసాగుతాయని ఆయన అన్నారు. రైతులకు అండగా నిలిస్తే తనపై అక్రమ కేసులు పెట్టారని రేవంత్ ఆరోపించారు.
Tags:
telangananews