విజయవాడ, మార్చి 20 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లో త్రిముఖ పోటీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు పోటీ పడగా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో రంగంలోకి దిగారు. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా.. ప్రచారంలో దుసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్న ఈ ఎన్నికలపై ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి. మేం గెలుస్తాం అంటే మేం గెలుస్తామని సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఇక ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యనే ఉంటుందని, పవన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న నేపథ్యంలో వీటికి బలాన్నిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్. ఏపీలో ముక్కోణపు పోటీపై స్పందిస్తూ.. జనసేన ప్రభావం ఎంత ఉంటుంది.
ఏపీలో త్రిముఖ పోటీపై ఆసక్తి
ఓట్లను చీల్చి జనసేన నిలబడగలుగుతుందా అన్న విషయాలపై స్పందిస్తూ.. రాష్ట్రంలో మూడో పార్టీగా ఉన్న జనసేనకు గడ్డుకాలమే. ఇదే విషయాన్ని గతంలో పవన్ కళ్యాణ్‌కి కూడా చెప్పాను. అధికార కేంద్రీకరణ, కులాల సమీకరణ, డబ్బుల పంపిణీ ప్రభావం లేకుండా దీర్ఘకాలంలో పనిచేస్తే ప్రజల్లో విశ్వాసం ఉన్న వాళ్ల వల్ల వ్యవస్థమారే అవకాశం ఉంది. ఎన్ని ఓట్లు వస్తాయన్నది ప్రజలే నిర్ణయిస్తారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో అదే స్టాండ్‌తో ముందుకు వెళ్తున్నారనే విషయంపై నాకు వివరాలు తెలియవు. తెలిసినా కూడా వాటిపై నేను మట్లాడదల్చుకోలేదు. ఎన్నికల బరిలో ఉన్నవాళ్లు.. లేనివాళ్లు ఎన్నికల తరువాత ఏమౌతుందన్న విషయాన్ని పరిగణలోనికి తీసుకుని ఓట్లు వేయాలి. రాష్ట్రం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఇలాంటి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి. ఉన్నంతలోనే మంచి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలి. నేను జనసేన మేనిఫేస్టో చూడలేదు.. వాటిపై నేను మాట్లాడలేను. రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప తాత్కాలిక ప్రయోజనాలకోసం పార్టీలు పనిచేయకూడదన్నారు’ జయ ప్రకాష్ నారాయణ్.