ఖమ్మంకు నాగార్జున సాగర్ సాగునీరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖమ్మంకు నాగార్జున సాగర్ సాగునీరు

ఎమ్మెల్యే సండ్ర అభ్యర్ధనకు స్పందించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,  మార్చ్-04, (way2newstv.com)
ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు  నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ని ఆదేశించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఙప్తి మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంకట వీరయ్య శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిశారు. 


ఖమ్మంకు నాగార్జున సాగర్ సాగునీరు

సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మెట్ట, ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారని చేప్పారు. ఆ పంటలకు ప్రస్తుతం నీరు అవసరమని, పదిరోజుల పాటు నాగార్జన సాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందించి, పంటలను కాపాడాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన  కేసిఆర్ వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు