వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా ఊపందుకున్న చేరికలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా ఊపందుకున్న చేరికలు

ఎమ్మిగనూరు  మార్చి 29 (way2newstv.com):
స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో  మాజీ ఎమ్మెల్యే, రైతు బాంధవుడు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు విశ్వనాథ్ ఆధ్వర్యంలో 29వ వార్డు చెందిన 200 మంది యువకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వనించారు. చేరిన వారిలో ఉసెనప్ప, ఉరుకుందు, జింక ఈరన్న, నరసింహ్మిలు, చంద్ర, ఓంకార్, అనుమంతు, వేంకటేష్ తదితరులు ఉన్నారు.


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి  జోరుగా ఊపందుకున్న చేరికలు

ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో యువకులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఐదేళ్లు పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్న సమయంలో నిరుద్యోగా భృతి అంటూ మోసం చేస్తున్నారన్నారు.టీడీపీని ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయన్నారు. టీడీపీ ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాల్లోనూ విసుగొచ్చిందని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో టీడీపీని సాగనంపి వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు ను నమ్మే స్థితిలో జనం లేరాని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల శ్రీనివాస్ రెడ్డి, టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ మన్సూర్ బాషా,టౌన్ యూత్ ప్రెసిడెంట్ నజీర్ ఆహ్మద్, లతిఫ్,  పార్టీ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.