ఖమ్మం, మార్చి 7 (way2newstv.com)
త్వరలో జరగనున్న ఎన్నికలకు పోలీస్ అధికారులు సన్నద్ధమై పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. పార్లమెంట్ , జెడ్పిటిసి, యంపిటిసి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా వెలువడే ఆవకాశం వున్న నేపథ్యంలో ముందస్తుగా ఎన్నికల విధినర్వహణలో పోలీసుల విదివిధానాలపై పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సమావేశమైయ్యారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంటరీ ఎన్నికలు కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగిన ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని అన్నారు. కాబట్టి ఎన్నికలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలని అన్నారు. ఎసిపి పర్యవేక్షణలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఎన్నికల విధివిధానాలపై సిబ్బందికి అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహించాలని అన్నారు.
త్వరలో జరగనున్న ఎన్నికలకు కు పోలీస్ అధికారులు సన్నద్ధమై ఉండాలి
ఎన్నికలు సమయంలో అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఎన్నికల కమిషన్ తీసుకునే తీవ్రమైన చర్యలకు గురి కావద్దని సూచించారు. మీకు అప్పగించిన బాధ్యతలు మాత్రమే సమయస్ఫూర్తితో నిర్వహించాలని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించి వివాదాస్పద అంశాలలో జోక్యం చేసుకోవద్దని అన్నారు. పోలీసు అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను విధిగా సందర్శిస్తూ.. పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు.
ఏలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పొలింగ్ పక్రియా విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.గత ఎన్నికలలో నమోదు అయిన కేసులలో ఎన్ని కేసులు డిస్పోషల్ చేశారు? ఎన్ని పెండింగ్ లో వున్నాయి అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.
నోటిఫికేషన్ వెలువడిన తరువాత కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు వంటి ఆంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకొవాలని అన్నారు. ఎలక్షన్ సెల్ ఎర్పాటు ,నాన్ బెయిలబుల్ వారెంట్స్ , ఆయుధాలు డిపాజిట్ ,ఎన్నికల నిర్వహణపై శిక్షణ వంటి ఆంశలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డిసిపి మురళీధర్, ట్రైనీ ఐపిఎస్ డా,,వినీత్, ఎస్బీ ఏసిపి సత్యనారాయణ, డిసిఆర్బి ఏసిపి రామనుజం, ఖమ్మం టౌన్ ఏసిపి వెంకట్రావు , ఖమ్మం రూరల్ ఏసిపి రామోజీ రమేష్ , వైరా ఏసిపి ప్రసన్న కుమార్ ,కల్లూరు ఏసిపి అంజనేయులు, టాస్క్ఫోర్స్ ఏసిపి రహ్మాన్, రమేష్ , నరేందర్, షూకుర్, సాయిరమణ, రమేష్ ,మురళీ, సాంబరాజు, రామకాంత్, సురేష్ , వేణుమాధవ్ , అంజలి, శివసాంబిరెడ్డి
పాల్గొన్నారు.
Tags:
telangananews