నిస్తేజంలో యువత, నిరుద్యోగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిస్తేజంలో యువత, నిరుద్యోగులు

సంగారెడ్డి, మార్చి 18 (way2newstv.com)
సంగారెడ్డి పట్టభద్రుల మద్దతు కోసం ఇక్కడికి వచ్చా.  న్యాయవాదులు, పాఠశాలల యాజమాన్యాలు, నిరుద్యోగుల మద్దతు కోసం ఇప్పటికే ఒకసారి వచ్చాను.  ఈ ఎన్నిక 42 శాసనసభ, 6 పార్లమెంట్ స్థానాలతో దాదాపు 40 శాతం రాష్ట్రంలో విస్తరించి ఉందని మాజీ ఎమ్మెల్యే,  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం అయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.  ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన యువత,  నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరడం లేదు.   కొత్త జిల్లాలు ఏర్పాటు వల్ల.. కొత్త ఉద్యోగాలు వస్తాయని భావిస్తే శాఖలు కుదించారు.  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారనుకుంటే. ఆ చర్యలు లేవని అయన విమర్శించారు.  పొరుగు రాష్ట్రం ఏపీ రెండు డిస్సీలు పూర్తి చేసి.. మూడోదానికి ప్రక్రియ ప్రారంభించింది.   


నిస్తేజంలో యువత, నిరుద్యోగులు

తెలంగాణలో ఒక్క డిస్సీ వేయలేదు.  నిరుద్యోగ యువత నిరాశలో ఉంది.  పీఆర్సీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు నిరుత్సాహంగా ఉన్నారు.  సీపీఎస్  తో ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు.   విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీయే ఇవ్వడం లేదు.  రాబోయే ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వాన్ని తట్టి లేపేలా తీర్పు ఇవ్వాలని అయన అన్నారు.  తెలంగాణ ఆకాంక్ష కోసం నాడు కాంగ్రెస్ తెరాసతో కలిసి పనిచేసింది.  నేడు తెరాస నిరంకుశంగా వ్యవహరిస్తోంది.  ప్రజాస్వామ్య వాదులంతా నాకు మద్దతు ఇచ్చి.. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. మంధని ఎమ్మెల్యే మాట్లాడుతూ  జీవన్ రెడ్డి   అభ్యర్థిత్వాన్ని పట్టభద్రుల, మేధావులు బలపరచాలి.  ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుంది.. అన్న విషయం మర్చిపోయి.. ప్రతిపక్షం లేకుండా చేస్తున్న తెరాస తీరును ఖండించాలని అన్నారు.  జీవన్ రెడ్డి గెలుపు కాంగ్రెస్ పార్టీకి అవసరం.  జీవన్ రెడ్డి  గెలుపు రాబోయే పార్లమెంట్, ఇతర ఎన్నికల్లో ఉత్సాహన్నీ ఇస్తుంది.   జీవన్ రెడ్డి అన్నీ వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారని అన్నారు.