బెజవాడ డివిజన్ కు పడిపోయిన ఆదాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెజవాడ డివిజన్ కు పడిపోయిన ఆదాయం

విజయవాడ, మార్చి 30, (way2newstv.com)
కృష్ణాజిల్లా నూజివీడు నుంచి న్యూ ఆజాద్‌పుర్‌కు ఎగుమతి చేసే మామిడి కాయల ఎగుమతి పక్క తెలుగు రాష్టమ్రైన తెలంగాణ ప్రాంతానికి తరలిపోవడంతో విజయవాడ డివిజన్‌కు భారీ స్థాయిలో ఆదాయనికి గండి పడుతోంది. గత రెండు దశాబ్దాల కాలం నుంచి నూజివీడు నుంచి రైలు మార్గం ద్వారా న్యూ ఆజాద్‌పుర్‌కు మామిడి కాయల ఎగుమతి జరిగేది. 2008లో 24 బోగీల ద్వారా 27 ట్రిప్పుల్లో 29.484 టన్నులు ఎగుమతి చేయగా విజయవాడ డివిజన్‌కు రూ. 4.25 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే 2009-10లో 32 ట్రిప్పులకుగాను 34.314 టన్నులు ఎగుమతి చేయగా రూ. 5.12 కోట్ల ఆదాయం వచ్చింది.2010-11లో 25 ట్రిప్పులకు 31.050 టన్నుల ఎగుమతి కాగా రూ. 4.56 కోట్లు వచ్చింది. 2011-12లో 27 ట్రిప్పులు ఎగుమతి చేయగా 34.020 టన్నుల ఎగుమతికి రూ. 5 కోట్లు ఆదాయం వచ్చింది.2012-13లో 20 ట్రిప్పులకు 25,200 టన్నులు ఎగుమతి చేయగా రూ. 3.75 కోట్లు ఆదాయం వచ్చింది. 



బెజవాడ డివిజన్ కు పడిపోయిన ఆదాయం

2013-14లో 24 ట్రిప్పులకుగాను 27.807 టన్నులు ఎగుమతి కాగా రూ. 5.35 కోట్లు ఆదాయం వచ్చింది. 2014-15లో చివరగా 10 ట్రిప్పులకు 12.540 టన్నులకు రూ. 2.89 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే 2014లో మామిడి కాయ పంట దిగుబడి బాగా తగ్గడంతో ఎగుమతులు కూడా భారీ స్థాయిలో తగ్గాయి. ఆ తరువాత 2016లో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌కు బదులు సికింద్రాబాద్ డివిజన్‌లోని బోనకల్లు ప్రాంతానికి ఎగుమతుల కేంద్రాన్ని తరలించారు. దీంతో ఈ సంవత్సరంతో కలుపుకుంటే ఇప్పటి వరకు గడచిన రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల నుంచి విజయవాడ డివిజన్‌కు మామిడి కాయల ఎగుమతిపై వచ్చే ఆదాయం పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్, మే నెలలో జరిగే ఎగుమతులు లేనట్లేనని తేలిపోయింది.
దక్షిణ మధ్య రైల్వే జోనల్ స్థాయికి చెందిన జనరల్ మేనేజర్ స్థాయిలో అధికారులు స్పందించిననట్లైతే నూజివీడు నుంచి తిరిగి ఎగుమతులు కావచ్చని ఆశాభావం వ్యక్తమవుతోంది. పైగా ఇక్కడ నుంచి ఎగుమతులు చేసే ఏజెంట్‌లు సైతం బోనకల్లుకు రోడ్డు మార్గాన తీసుకువెళ్లడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.