సికింద్రాబాద్, మార్చి 2, (way2newstv.com)
సికింద్రాబాద్ లోని పారడైస్ వద్ద శ్రీ చైతన్య కళాశాల లో ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్ధి గోపి రాజ్ శనివారం పరీక్ష రాస్తుండగా ఆకస్మిక మృతి చెందాడు. గోపిరాజ్ ఒక్కసారిగా కుప్పకులడంతో టీచర్లు ఆస్పత్రికి తరలించారు.
పరీక్ష రాస్తూ విద్యార్ధి మృతి
ఆ లోపే అతను మృతి చెందారు. గోపిరాజ్ అమీర్ పెట్ లో ఎల్లారెడ్డి గూడ లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్ష కు హాజరైన గోపి రాజ్ ఉదయం బాగానే ఉన్నట్లు అతని తండ్రి తెలియచేసారు. ఇలా అకస్మాత్తుగా చనిపోవడం తో తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారు.ఇన్ని రోజులుగా ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని ఇలా అవుతుందని తాము అనుకోలేదన్నారు.
Tags:
telangananews