ఏలూరు, మార్చి 14, (way2newstv.com)
సాగునీటి ఎద్దడి రైతులను వెం టాడుతోంది. దాళ్వా పంటలో నాలుగు డబ్బులు వెనకేసుకుందామని సాగుకు ఉపక్రమించిన రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు చుక్కలు చూపిస్తున్నారు. యలమంచిలి మండలంలోని కొంతేరు చానల్ పరిధిలోని కొక్కిరాయికోడు, దిగమర్రు చానల్ పరిధిలోని చీమలకోడు, కాజ పడమర పరిధిలో సుమా రు 150 ఎకరాల వరి సాగవుతోంది. కాలువ శివారు భూములకు సుమారు 20 రోజులుగా నీరు అందకపోవడంతో చేలన్నీ బీళ్లు తీశాయి.
రైతులను వెంటాడుతున్న నీటి ఎద్దడి
ఆఖరుగా 20 రోజుల క్రితం వంతునీరు ఇచ్చినప్పుడు కొంతమేర శివారు భూములు తడిచాయి.అక్కడికీ రైతులు సొంతంగా నీరు తోడుకుంటాం నీరు కాలువ శివారుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు. దాళ్వా ప్రారంభానికి ముందు జనవరి ప్రారంభంలో సాగు చేసిన రైతులకు మార్చి నెలాఖరు వరకు సాగునీటి కొరత రానివ్వబోమని ప్రచా రం చేసిన అధికారులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.ఎకరాకు 7 బస్తాలు కౌలు ఇచ్చేలా ఆరున్నర ఎకరాలు సాగు చేస్తున్నాను. నీరందక చేను మొత్తం ఎండిపోయింది. ఇప్పు డు చేను పాలుపోసుకునే దశలో ఉంది. ఈ దశలో నీరు పెట్టకపోతే కంకులలోని గింజ గట్టిపడక తప్పలుగా మారే ప్రమాదముంది. అదే జరిగితే కౌలు గింజలు కూడా దక్కవు. పెట్టుబడి మొత్తం నష్టపోతాను. అధికారులు కనికరించి వంతు సమయం పెంచి శివారు భూములకు నీరివ్వాలి.