ఎన్నికల్లో సహకరిస్తే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల్లో సహకరిస్తే

ఐదేళ్లు మీ కోసం పని చేస్తాం
మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి 
నెల్లూరు, మార్చి 5, (way2newstv.com)
ఈ ఎన్నికల్లో మహిళలంతా సహకరించి పని చేస్తే రానున్న ఐదేళ్లలో మీకు మేలు చేసేందుకు కృషి చేస్తామని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు మంగళవారం ఆదాల కార్యాలయంలో జరిగిన పొదుపు మహిళ లీడర్ల సమావేశంలో వారు మాట్లాడారు మహిళా శక్తి చాలా గొప్పదని ఒక కుటుం బాని ఒక సమాజాన్ని మార్చే శక్తి కలిగినటువంటిదని ఆయన కితాబునిచ్చారు ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా మహిళల మద్దతు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు ఈ ఐదేళ్లలో చంద్రబాబు 10 వేల చొప్పున రెండుసార్లు పసుపు కుంకుమ తీసుకున్నారని గుర్తు చేశారు రానున్న ఐదేళ్లలో దాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు మహిళలకు ఇళ్ల తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని చెప్పారు.


ఎన్నికల్లో సహకరిస్తే 

లిఫ్టులు పెట్టడానికి అంగీకరించారని అలాగే లోన్లు రద్దు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు పెన్షన్లను 10రెట్లు పెంచామని వచ్చే ఐదేళ్లలో దాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు మహిళలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు మహిళలతో సమాజమంతా ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశముందని తెలిపారు గతంలో మహిళలు చాలా వరకు వెనుక బాటు తో ఉండే వారని ఇప్పుడు మరింత చైతన్యం రావడం వల్ల వ్యక్తిగతంగా ఎదగడానికి ఎంతో అవకాశం కలిగిందని చెప్పారు అంతే కాకుండా మహిళలు ధైర్యంగా ఆలోచనాత్మకంగా ముందుకు సాగే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్న చంద్రబాబును ఆయన ప్రతినిధిగా నన్ను మంత్రి నారాయణ ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ అధ్యక్షురాలు తాళ్ళపాక అనురాధ శోభారాణి కార్పొరేటర్ సైలజ పద్మమ్ము ఝాన్సీ పద్మజ కార్పొరేటర్లు శైలజ మేకల రజిని శ్రీవిద్య అలాగే రజని తదితరులు పాల్గొన్నారు