దేశం తలరాత మార్చేది సీఎం కేసీఆరే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేశం తలరాత మార్చేది సీఎం కేసీఆరే

సుల్తానాబాద్ ధూంధాంలో మంత్రి కొప్పుల
సింగరేణి కార్మికులకు ఐటీ పన్ను రద్దు చేయిస్తా: 
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని
పెద్దపల్లి, మార్చి 28 (way2newstv.com)
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన నేత సీఎం కేసీఆర్.. దేశం తలరాతను  మార్చబోతున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అధ్యక్షతన  బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో   ధూంధాం కార్యక్రమంలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. భవిష్యత్తును  నిర్ణయించే ఎన్నికల్లో మన సత్తాను చూపించాలన్నారు. ఈ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేత కానిని  బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు  శ్రీరామరక్ష అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మారథం పట్టారని చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు.  ఎంపీ ఎన్నికల్లో కూడా అన్ని సర్వేలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. సింగరేణి కార్మికులకు ఐటీ పన్ను రద్దు చేయిస్తా: 


దేశం తలరాత మార్చేది సీఎం కేసీఆరే

కార్మికులకు ఐటీ పన్ను రద్దు చేయించేందుకు కృషిచేస్తానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని హామీ ఇచ్చారు.  బుధవారం పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-5వ గనిపై మైసమ్మ తల్లి విగ్రహం వద్ద రామగుండం ఎమ్మెల్యే  కోరుకంటి చందర్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. గేట్ మీటింగులో  మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే తాను పెద్దపల్లి నుంచి పోటీచేస్తున్నానని, తాను పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లా  వాసినేనని, సాధారణ కార్మికుని కుటుంబంలో పుట్టిన తాను గ్రూపు-1 అధికారిగా పని శానని, ఉద్యమంలో కూడా పాల్గొన్నానని గుర్తుచేశారు. సింగరేణి కార్మికులు తనను ఆదరించి గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించి గళమెత్తి ఐటీ పన్ను రద్దు చేయిస్తానని 
భరోసా ఇచ్చారు.
వారసత్వ ఉద్యోగాలు సీఎం కేసీఆర్ చలవే: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను సీఎం కేసీఆర్ సాధించి పెట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. గనులపై యువ కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది సీఎం కేసీఆర్, ఎంపీ కవిత చలువేనని చెప్పారు.  పెద్దపల్లి ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ను గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశానికి  వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల తెగింపుతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఇంకా మనం 
సాధించుకునేది చాలా ఉన్నదని, రాబోయే ఎన్నికల్లో వెంకటేశ్ ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు.