ఎన్నికల ప్రచారంలో ఈవెంట్ మేనేజ్ మెంట్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల ప్రచారంలో ఈవెంట్ మేనేజ్ మెంట్స్

రంగారెడ్డి, మార్చి 28, (way2newstv.com)
ఎన్నికల ప్రచారంలో ఎక్కడా చూసినా ఈవెంట్‌ మేనేజర్లు హల్‌చల్‌ చేస్తు న్నారు. తాజాగా ఒక పార్టీకి సంబంధించి ఒక కాలనీలో సమావేశం పెట్టాలని కాలనీవాసులు సదరు పార్టీ అభ్యర్థిని కోరితే తమకు సమయం లేదని, తమ ఈవెంట్‌ మేనేజర్లను పంపిస్తానని ఆ అభ్యర్థి చెప్పడంతో స్థానికులు ఒక్కసారిగా అవా క్కయ్యారు. కరపత్రం, సభలు, ఇంటింటి ప్రచా రం, ప్రచార రథాల నిర్వహణ, బహిరంగసభలు, ప్రజాసంబంధాలు ఇలా ప్రతి కార్యాన్ని ఈవెంట్‌ సంస్థలకు అభ్యర్థులు కాంట్రాక్టుకు అప్పగిస్తు న్నారు.వ్యాపార ప్రమోషన్లు, పెండ్ల్లీలు, పేరంటాలకే పరిమితమైన ఈవెంట్‌ మేనేజ్‌మెంటు సంస్థలు తాజాగా ఎన్నికల ప్రచారంలోకి ప్రవేశించాయి. జనంతో కోలాహలంగా జరగాల్సిన ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డబ్బు కు డబ్బుకు, పేరుకు పేరు సంపాదిస్తు న్నాయి. డిజిటల్‌ మీడియాతో ప్రచారాన్ని బహిరంగ సభలను సైతం హోరెత్తిస్తున్నాయి. గతంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు, అహర్నిశలు కష్టపడి పని చేసేవారు. రాను రాను ఎన్నికల ప్రచారంలో కార్యకర్తల పాత్ర తగ్గిపోయి ఈవెంట్‌ సంస్థల ప్రమేయం పెరుగుతున్నది. 


ఎన్నికల ప్రచారంలో ఈవెంట్ మేనేజ్ మెంట్స్

ఎన్నికల ప్రచారాన్ని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సం స్థకు అప్పగించినట్టు తెలిసింది. ఈవెంట్ల నిర్వహ ణలో ముఖ్యంగా యువత సైతం ఆసక్తి చూపి స్తున్నారు. కార్యకర్తలుగా పని చేస్తే రెండు పూటలా భోజనం తప్ప ఒనగూరే ప్రయోజనమేది లేదని అంటున్నారు. యువత ఉపాధి కోసం రాజకీయ కార్యకర్తలు పని చేయడం కంటే, ఈవెంట్ల సంస్థల్లో పని చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ వారసులకో, శ్రీమంతులకో, పారచూట్లతో టికెట్‌ ఇస్తుండటంతో రాజకీయాల పట్ల యువత ఆనాసక్తిని చూపిస్తున్నారు. మరోవైపు రాజకీయా ల్లో ఉంటూ ప్రజాసేవలో ఉండే నాయకులకు కాకుండా కార్పొరేట్లకు, రియల్టర్లకు, వ్యాపారవేత్త లకు, కాంట్రాక్టర్లకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు టికెట్లు కట్టబెడుతున్నాయి. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నేతలకు కాకుండా ఎన్నికల ఖర్చు భరించగలిగే నేతలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. ధనబలంలో టికెట్లు సాధించినా... క్షేత్రస్థాయి పరిస్థితులపై అభ్యర్థుల కు అవగాహన లేకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో స్థానిక కార్య కర్తలు, నాయకులు సదరు అభ్యర్థి కోసం ఎక్కువ సమయం కేటాయించి ప్రచారం నిర్వహించే పరిస్థితులు కనిపించడంలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో అభ్యర్థి గెలుపు కోసం స్వచ్చంధంగా పని చేసే కార్యకర్తలు ముందుకు రావడం లేదు. ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడిన అంశంగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో ప్రచారాన్ని నిర్వహించడం కొంత ఇబ్బందికరంగా మారింది. రాజకీయ అనుభవం లేకపోయినా వ్యాపారపరమైన ఫంక్షన్లకు ఈవెంట్‌ అప్పగించిన అనుభవం వారికి ఉండటంతో తమ ఎన్నికల ప్రచారాన్ని సైతం ఈవెంట్ల రూపంలో చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు కొన్నింటిని ఈవెంట్ల సంస్థలకు అప్పగించారు. నల్లగొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వి నర్సింహరెడ్డి, చేవెళ్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజీత్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నెం శ్రీనివాసరెడ్డి లాంటి అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారాన్ని ఈవెంట్‌ ఏజెన్సీలకు అప్పగించినట్టు ఆయా పార్టీ వర్గాలు అంటున్నాయి. సభల నిర్వహణ, జనమీకరణ కూడా కొన్ని చోట్ల ఈవెంట్లకు అప్పగిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచారంలో ప్రజాసంబంధాలు, కార్యక్రమాల నిర్వహణ సైతం వాటికే ఇస్తున్నారు. స్వతహాగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం కంటే ఈవెంట్ల మేనేజ్‌మెంట్‌ ఎజెన్సీలకు ఇవ్వడం ద్వారా డబ్బు వృధా కాదని చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థుల సలహాదారులు చెప్పారు. ఎన్నికల్లో నరేంద్రమోడీ తన ఎన్నికల ప్రచారంలో కీలకంగా పని చేసిన 'సోషల్‌ మీడియా' నిర్వహణను ఈవెంట్‌ సంస్థకు ఇచ్చినట్టు ఐటీ మాజీ ఉద్యోగి దీపక్‌ జాన్‌ తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించి, సాధారణ ఓటరును సైతం కదలించారు. ఆ తర్వాత క్రమంలో చాలా మంది నేతలు సోషల్‌ మీడియాను ఆయుధంగా మార్చుకున్నారు. అభ్యర్థి తన ఎన్నికల ప్రచారాన్ని తొలుత సోషల్‌ మీడియా ద్వారానే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రధాని మోడీ తొలుత అధికారంలోకి రావడానికి ప్రచార, సర్వే బాధ్యతలను ప్రశాంత్‌కిషోర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.