తుగ్గలి, మార్చి 18 (way2newstv.com)
కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గ అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సోమవారం 10 గంటలకు ఎన్నికల నోటీసును విడుదల చేసిందని తుగ్గలి తాహసిల్దార్ అనిల్ కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా తాహసిల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థి 18 నుండి 25వ తేదీ సాయంకాలం 3 గంటల లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గాని, రిటర్నింగ్ అధికారికి గాని,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి గాని లేక కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ కు గాని నామినేషన్ పత్రం అందజేయవచ్చని వారు తెలియజేశారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నోటీసు విడుదల
26న ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారని,ఎన్నికలలో పోటీ చేయలేని అభ్యర్థి ఉపసంహరణ నోటీసులను రాత పూర్వకంగా 28న సాయంకాలం 3 గంటల లోపు జిల్లా కలెక్టర్ కు అందజేయాలని వారు తెలియజేశారు.నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహిస్తామని తహసిల్దార్ తెలియజేశారు.జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ఎన్నికల నోటీసును ప్రభుత్వ కార్యాలయాలలో మరియు గ్రామ పంచాయతీల నోటీసు బోర్డులో పొందుపరిచినట్టు తాహసిల్దార్ అనిల్ కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు,వీఆర్వోలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.