పెద్దపల్లి మార్చి 26 (way2newstv.com)
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఇతర అధికారులతో కలిసి మంథాని లోని జేఎన్టీయూహెచ్ కళాశాలను పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబందించిన ఈవీఎం యంత్రాలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేయాలనీ , కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలనీ అన్నారు.
జేఎన్టీయూహెచ్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్
మే 23, న కౌంటింగ్ జరుగుతుందని, సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని ఒ అర్ ఎస్ ప్యాకెట్ లు సైతం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సజావుగా కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ అధికారులకు తెలిపారు. జిల్లా ఇంచార్జి డిఆర్వో కె. నరసింహ మూర్తి, మంథని ఆర్డీవో నగేష్, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.