కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు

మహబూబ్ నగర్ మార్చి 2, (way2newstv.com)
మహబూబ్ నగర్  జిల్లా ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయ్యాక ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగయ్యాయి.. 11 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఎస్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం అయన జనరల్ ఆస్పత్రిలో  మౌళిక సదుపాయాలు,  అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్. 


కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు

ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుండే కాకుండా కర్ణాటక నుండి కూడా రోగులు ఇక్కడ సేవలు వినియోగించుకునేల వైద్యులు పనిచేయాలి. ఏ ఒక్క వైద్యున్ని కూడా డిప్యుటేషన్ పై పంపొద్దని అన్నారు. వైద్య  కళాశాల నూతన భవన సముదాయంలో ఇప్పటికే కళాశాలలో తరగతులు ప్రారంభమైనాయి త్వరలో అక్కడ వైద్యసేవల్ని ప్రారంభిస్తాం. కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా జనరల్ ఆస్పత్రిని తీర్చిదిద్దుతామని అన్నారు.
Previous Post Next Post