వరంగల్, మార్చి 26 (way2newstv.com)
వర్తక వాణిజ్య రంగంలో ఎదురవుతున్న సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనుటకు కొత్త తరహా విధానాలను అనుసరించాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఆర్ సాయన్న అన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స కళాశాల లోని వాణిజ్య శాస్త్ర విభాగం మేనేజ్మెంట్ విభాగం సంయుక్తంగా “వాణిజ్య రంగంలో ఉద్భవిస్తున్న సమస్యలు సవాళ్లు” అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశానికి కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగం విశ్రాంతాచార్యులు కె వి చలపతి, కాకతీయ యూనివర్సిటీ వాణిజ్య శాస్త్రం విభాగం సంచాలకులు ఆచార్య కమలేశ్వర్ రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగం ఆచార్యులు ఎస్ వి. సత్యనారాయణ, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రిన్సిపాల్ ఆచార్య సక్రియ.
వ్యాపార అభివృద్ధి లో సమస్యలను - సవాళ్లను ఎదుర్కోవాలి! వీసీ సాయన్న
ఈ సదస్సు సంచాలకులు డాక్టర్ కట్ల రాజేందర్ పాల్గొన్న సమావేశంలో ఉప కులపతి సాయన్న మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధి లో ప్రపంచీకరణలో భాగంగా, పోటీ పడడానికి భారతదేశంలో కూడా వ్యాపార ధోరణి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందుకు కావలసిన మెళుకువలను గుర్తించి సమస్యలను సవాళ్ళను అధిగమించాలని ఆయన అన్నారు. ప్రతి పెట్టుబడిదారుడు వ్యాపార ధోరణితో వ్యవహరించడం వల్ల కొనుగోలుదారులపై ఒత్తిడి పెరుగుతుందని సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా వర్తక వాణిజ్య విధానం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కేవలం వ్యాపార ధోరణితో కాకుండా వినియోగదారునికి ఉపయోగపడే విధంగా వస్తు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలు వ్యాపార అభివృద్ధికి కొంతవరకు విఘాతం కలిగిందని చెప్పవచ్చు వ్యవసాయ రంగం, భీమ రంగాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు, కొత్తగా వ్యాపారం లోనికి అడుగు పెట్టిన యువ పారిశ్రామిక వేత్తలు మెళుకువలను గుర్తించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.
2. సదస్సులో కీలకోపన్యాసం చేసిన ఆచార్య చలపతి మాట్లాడుతూ పెట్టుబడిదారులు తమ వ్యాపార ధోరణి పెంపొందించుకునే విధంగా వ్యవహరిస్తాడని అయితే ఇందులో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు . యువ పారిశ్రామిక వేత్తలు వాణిజ్య రంగంలో మార్పులకు గుర్తించి వ్యాపార అభివృద్ధి కోసం మెలుకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని ప్రభుత్వం నుండి వస్తున్న రాయితీలను పొందుతూ వ్యాపారం చేసే వ్యక్తులు నాణ్యమైన వస్తు ఉత్పత్తికి ప్రయత్నం చేయాలని కేవలం తమ వస్తువులను మార్కెట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాయి తప్ప కొనుగోలు దారిని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి రంగాలలో నాణ్యత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని గుర్తెరగాలి అని ఆయన అన్నారు
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విధానంలో వస్తున్న మార్పులలో భాగంగానే కొత్త తరహా విధానాలను అనుసరించడానికి ముందుకు రావడానికి పెట్టుబడిదారులు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.