విజయవాడ, మార్చి 13, (way2newstv.com)
వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. అయితే ఎన్నికల్లో పోటీపై నిర్ణయాన్ని మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకే రాధా వదిలేశారు. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబుతో చర్చలు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఈ ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబుతో భేటీలో వైసీపీలో తనకు జరిగిన అవమానాలను కూడా రాధా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తనకు ఎన్నిల్లో పోటీ చేయటం ప్రధాన ఉద్దేశం కాదని.. వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని రాధా పేర్కొంటున్నారు. టీడీపీలో చేరేందుకు రాధా అంగీకారం తెలిపారు.విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా తన వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీని వీడిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
మచిలీపట్టణం నుంచి వంగవీటి పోటీ
గత నెల రోజులుగా ఈ విషయం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. ఆయన ఎప్పుడు చేరబోతున్నారు అనే దాని పై కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి. రాధా పార్టీని వీడినప్పటినుండి దాదాపుగా నేటికి నెల రోజులు వరకు అయ్యుంటుంది కానీ ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి సరిగ్గా నేటి తో ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇక ఆయన పార్టీలో చేరకపోతే ఆయనకే నష్టం వాటిల్లుతుందని అక్కడి జనం అనుకుంటున్నారు. రెండు మూడు రోజుల నుండి ఆయన మళ్ళీ తెర పై కనిపిస్తున్నాడు. నిన్న సాయంత్రం ఆయన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ భేటీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇది ఇలా ఉండగా ఉన్నట్టుండి మళ్ళీ సోమవారం రాత్రి వంగవీటి రాధా విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీ లో రాధా చంద్రబాబు తో తన డిమాండ్లని చెప్పుకునట్టు దానికి బాబు ఒప్పుకునట్టు సమాచారం వస్తుంది. రాధా కి చంద్రబాబు నర్సారావుపేట లేదా అనకాపల్లి టికెట్ ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది. దీంతో రాధా చంద్రబాబు సమక్షం లో టీడీపీ లో చేరడం పక్కా అంటున్నారు టీడీపీ నాయకులు. వంగవీటికి టికెట్ ఇస్తే మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణను పెడన శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది.