అమరావతి మార్చి 28 (way2newstv.in)
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చర్చకు వస్తారా అని అడిగారు. వస్తామని చెప్తే ఇప్పటి వరకు స్పందించలేదు. * దీన్ని తప్పుదోవ పట్టించేందుకు నాపై వ్యక్తిగత దూషణలకు దిగారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. గురువారం అయన మీడియతో మాట్లాడారు. నేను అవినీతి చేశానని బిజెపి నేత విజయబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యాఖ్యలు చేసిన విజయబాబు కి నోటీసులిచ్చా. దీనిపై స్పందించకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కన్నా డిపాజిట్ తెచ్చుకుంటే 10 లక్షలు ఇస్తానని చెప్పా? చంద్రబాబు హెలికాఫ్టర్ లో డబ్బు తరలిస్తున్నారని మాట్లాడుతున్నారు.
పరువు నష్టం దావా వేస్తా
హెలికాఫ్టర్ లో డబ్బు తరలించడం వీలయితే, బిజెపి దేశ వ్యాప్తంగా ఉన్న హెలికాఫ్టర్లు వాడుతున్నారని చెప్తున్నారు..డబ్బు తరలించడానికే వీటిని బిజెపి వాడుతుందా అని ప్రశ్నించారు. ఆధారం లేకుండా వ్యక్తిగత దూషణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పదు. గాలి మాటలు, గాలి వార్తలు అని మాట్లాడారు...అలాంటి గాలి వార్తలతో మాట్లాడొద్దని కన్నాలక్ష్మినారాయణ కు సూచిస్తున్నా. మోదీ దేశ ప్రజలు ఎలా బ్రతకాలో కాకుండా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆలోచించాలి. ఆర్బిఐ గవర్నర్ రఘురామ రాజన్ మీరు చూపిన లెక్కలన్నీ అంకెలగారడీ అన్న దానికి సమాధానం చెప్పాలి. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఒక్కటే 1.40 వేల కోట్లు అప్పు చేసింది. ఒక శాఖ ఇంత అప్పు చేసి..ఆంధ్రప్రదేశ్ ని ప్రశ్నించే హక్కు కేంద్రానికి ఎక్కడ ఉందని అయన నిలదీసారు.