జీపీఎస్ ట్రాకర్ తో క్షేమం..లాభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జీపీఎస్ ట్రాకర్ తో క్షేమం..లాభం

రంగారెడ్డి, మార్చి 6, (way2newstv.com)
ఒక్కప్పుడు మనం వినియోగించే వస్తువులకు భద్రత ఉండేది కాదు. ఇంటి ముందు ద్విచక్ర వాహనం, కారు పార్కింగ్ చేస్తే ఎవరైన ఎత్తుకెళ్తారని భయం, ఇంటి నుండి బయటకి వెళ్లిన చిన్నారులు, కళాశాలకు వెళ్లిన అమ్మాయిలు, బయటకు వెళ్లిన వృద్ధులు ఎక్కడాన్నరనే ఆందోళన. ప్రయాణల్లో బ్యాగ్‌లు మార్చిపోతే తిరిగి పొదడం అసాధ్యం ఒక వైపు దొంగల చేతి వాటం మరొవైపు ఉరుకుల పరుగుల జీవితంలో తీవ్ర ఒత్తిడితో మతి మరుపు ఏ వస్తువు ఎక్కడ పెట్టామో గుర్తుపెట్టుకోలేని పరిస్థితి. విటన్నిటికి చిన్న ఎలక్ట్రానిక్ పరికరంతో చెక్ పెట్టేందుకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం జిపిఆర్‌ఎస్ ట్రాకర్ ఓ అవసరంగా మారింది. మనిషికి అవసరాల నిత్య మార్కెట్‌లోకి వచ్చిన వస్తువుల్లో జిపిఆర్‌ఎస్ ట్రాకర్ పరికరం ఒక్కటిగా చెప్పవచ్చు.


 జీపీఎస్ ట్రాకర్ తో క్షేమం..లాభం

ఇదీ వైర్లేస్ ఒబిడి ట్రాకర్‌ను సకెట్‌లో ప్లక్‌ల పెట్టుకోవచ్చు. దీంతో వాహనాలు ఎక్కడకు వెళ్లింది, ఎక్కడ నిలించింది, ఎట్టు వెళ్లుతుందో ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు. దీని ధర కేవలం 4,899 నుండి ప్రారంభమౌతుంది. అలాగే ఫోన్ విల్లరు ట్రాకర్ ధర 1,899 మ్యాగ్నెటిక్ ట్రాకర్ ధర 6,999 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి సహయంతో వాహనాలు ఎక్కడ ఉన్నయో తెలసుకోవడంతో పాటు ఇంజన్ స్టాట్ కాకుండా చేయవచ్చు.ఇది మనుషుల భద్రతకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు, కళాశాలలకు వెళ్లే అమ్మాయిలు వారి వెంట స్మార్ట్ ఫోన్‌లు అనుమతించారు. అలాంటప్పుడు పర్సనల్ ట్రాకర్‌ను బ్యాగ్‌లో పెట్టి పంపితే వారు ఎక్కడ ఉన్నారో తెలసుకోవచ్చు. ఎదైన ప్రమాదం, భద్రతకు గురైతే దానికి ఉన్న చిన్న బట్టన్ ప్రేస్ చేసి పట్టుకుంటే క్షణల్లో ముందుగా ట్రాకర్‌ను అనుసంధనం చేసి సెల్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దీనితో లోకేషన్ సులువుగా గుర్తించవచ్చు. బ్యాగ్‌లు, సుట్టికేస్‌లు, ల్యాప్‌ట్యాప్ బ్యాగ్‌ల్లో ఈ పరికరాన్ని ఉంచితే చాలా వరకు దొంగలించిన వస్తువులను తెచ్చుకోవచ్చు. దీని ధర 4,599 రూపాయల నుండి ప్రారంభమైతుంది.