మీ సేవల్లో బాదేస్తున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మీ సేవల్లో బాదేస్తున్నారు

రాజమండ్రి, మార్చి 30, (way2newstv.com
సులభంగా.. వేగంగా.. అంటూ మొదలై.. మీ సౌలభ్యానికి.. సౌకర్యానికి అంటూ సాగుతున్న మీసేవలకు ఇక బాదుడు మొదలైంది. మీసేవల రుసుంలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం  అమలులోకి వచ్చిం ది. పలు రకాల సర్వీసులు మీసేవ కేంద్రాల ద్వారానే అందుతుంటాయి. దీంతో ప్రజలు ఆయా అవసరాల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తు తం వసూలు చేస్తున్న రుసులపై రూ.10 అదనపు భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోం ది. ఇప్పటికే పలు ప్రైవేట్‌ మీసేవ నిర్వాహకులు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నా థుడే కరువయ్యాడు. ఈ నేపథ్యలో ప్రభుత్వం రూ. 10 అదనంగా పెంచడంతో నిర్వాహకులు ఇంకెంత వసూలు చేస్తారోనని ఆందోళన వ్యక్తమవుతోంది.విశాఖ జిల్లాలో 2004 మార్చిలో ఈసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వీటినే మీసేవ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వానికి చెందిన 22 మీసేవ కేంద్రాలను రామ్‌ఇన్ఫో సంస్థ నిర్వహించడం తెలిసిందే. ఈ సంస్థ ఫ్రాంఛైజీలు 200కి పైగా ఉన్నాయి. ఇక ఏపీ ఆన్‌లైన్‌ సంస్థకి ఫ్రాంఛైజీలు మరో 200 వరకు ఉన్నాయి. 


మీ సేవల్లో బాదేస్తున్నారు

ఈ కేంద్రాల్లో 300 వరకు సర్వీసులు అందుతుండగా.. రెగ్యులర్‌గా ఉపయోగించుకునే సర్వీసులు 50 వరకు ఉన్నాయి. ప్రభుత్వ, రామ్‌ఇన్ఫో కేంద్రాలలో రోజుకు దాదాపుగా రూ.50లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా రూ.40లక్షల వరకు లావాదేవీలు సాగుతున్నట్టు సమాచారం.మీసేవ కేంద్రాల ద్వారా అందుతున్న ఏ, బీ క్యాటగిరీ సేవలపై సర్వీసు చార్జీలను పెంచారు. ఏ క్యాటగిరీలోని అడంగళ్, వన్‌బీ, పట్టాదారు పాసుపుస్తకం వంటి సేవలు పొందడానికి ఇప్పటివరకు రూ.25 చొప్పున సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక నుంచి ఈ చార్జీ రూ.35కి పెరిగింది. బీ క్యాటగిరీలోని కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, కుటుంబ వారసత్వ ధ్రువపత్రం వంటి సేవలు పొందడానికి ఇప్పటి వరకు సర్వీసు చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుండగా.. శనివారం నుంచి ఇది రూ.45కి పెరిగింది. మొత్తమ్మీద ఈ రెండు క్యాటగిరీల సేవలపైనా రూ.10 అదనపు భారం పడినట్టయింది. ఈ రెండు విభాగాలలోను మీసేవ కేంద్రాలలో నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. అంటే జిల్లా ప్రజలపై నెలకు రూ.లక్ష వంతున అదనపు భారం మోపినట్టయింది. ప్రభుత్వ మీసేవ కేంద్రాలలో ధ్రువపత్రాల కోసం రూ.35 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ మీసేవ కేంద్రాలలో స్కానింగ్‌ చార్జీలంటూ రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై ఫిర్యాదు అందడంతో సీతంపేటలోని ఒక కేంద్రాన్ని అప్పటి తహసీల్దార్‌ సీజ్‌ చేయడం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ నిర్వాహకుల వినతి మేరకే చార్జీలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.