విజయవాడ, మార్చ్ 29 (way2newstv.com)
2013 జనవరి 16న నన్ను విజయవాడ ఎంపి అభ్యర్దిగా చంద్రబాబు ప్రకటించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల సమస్యలు అనేకం పరిష్కారించాను. గత ఎన్నికలు నాకు ఛాలెంజింగ్ పిరియడ్.. ఎమ్మెల్యే లు, కార్పొరేషన్ ఎన్నికలలో టిడిపి ని గెలిపించుకున్నామని ఎంపీ కేశీనేని నాని అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. 2014లో అరవై వేల కు పైగా మెజారిటీతో ప్రజలు గెలిపించారు. నా రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిది.. ఎక్కడా చిన్న మచ్చ కూడా పడకూడదనే పని చేస్తా. నాని ముక్కు సూటిగా మాట్లాడినా .. మాటల మనిషి కాదు.. చేతల మనిషి అనే పేరు పొందడం నా అదృష్టం.
నా జీవితం తెల్ల కాగితం
కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ అసలు సాధ్యమే కాదనక కాంగ్రెస్ పాలనలో చెప్పారు. నేను ఎంపి అయ్యాక అన్ని శాఖల అధికారుల చుట్టూ ఆరు నెలల పాటు తిరిగి శాంక్షన్ చేయించా. ఏ శాఖ పరిధిలో ఆ రహదారి ఉందో కూడా తెలియని పరిస్థితి వుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు వివరించి ఒప్పించా. నేను చెప్పిన అంశాలు విని నితిన్ గడ్కరీ నిర్మాణానికి అంగీకరించారు. మూడేళ్లుకు పైగా నిర్మాణ పనులు జరుగుతుందని ఆనాడే చెప్పా. దేశంలోనే నదిలో నుంచి బయటకు వచ్చే అందమైన ఫ్లైఓవర్ డిజైన్ ఇదని అన్నారు. ట్రాఫిక్ కష్టాల నేపధ్యంలో మళ్లీ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ను కూడా తెచ్చుకున్నాం. కంకిపాడు బస్టాండు కంటే విమానాశ్రయం హీనంగా ఉండేది. 1300ఎకరాలలో విమానాశ్రయం విస్తరించి దేశంలోనే ప్రముఖ విమానాశ్రయం గా అభివృద్ధి చేశాం. నేడు 70-80 విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. భవిష్యత్తు లో అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడకు వస్తాయి. టాటా ట్రస్ట్ ద్వారా లక్షల మందికి వైద్య సేవలు, గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాం. ముంబాయి తర్వాత టాటా ట్రస్ట్ ఆఫీసు కేవలం విజయవాడ లోనే ఉందని అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి లో వేయి కోట్లు తో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కూడా జరుగుతుంది. నా పార్లమెంటు నియోజకవర్గం లో 260 గ్రామాలలో టాటా ట్రస్ట్ సేవలందిస్తుందని అయన అన్నారు.