ఒంగోలు మార్చ్ 14 (way2newstv.com)
ప్రకాశం జిల్లాలోని పర్చూరు శాసనసభ స్థానం నుంచి వైకాపా తరఫున సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కుమారుడు హితేష్ చెంచురాంను పోటీలో దించాలని ప్రయత్నాలు జరిపినా, ఆయనకు అమెరికా పౌరసత్వం ఇంకా రద్దవని కారణంగా భారత పౌరతస్వం రాలేదు.
పర్చూరు శాసనసభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా దగ్గుబాటి పోటి
ఈ దస్త్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ పరిశీలనలోనే ఉండడంతో పరిష్కారానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. భారత పౌరసత్వం లేనివారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. దీంతో వెంకటేశ్వరరావునే పోటీలోకి దించాలని వైకాపా యోచిస్తోంది. ఆయన సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. దీనిపై వైకాపా అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గత నెలలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో కలిసి దగ్గుబాటి హితేష్ వైకాపాలో చేరారు. ఆ సమయంలో వెంకటేశ్వరరావు వైకాపాలో చేరలేదు. పార్టీ కండువా వేసుకోలేదు.