కొత్త మలుపు తిరుగుతున్న శరత్ స్టోరీ
హైద్రాబాద్, మార్చి 29, (way2newstv.com)
సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పందించిన తీరుకు అనూహ్య స్పందన లభించింది. ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌తో భూ సమస్యకు పరిష్కారం లభించడంతో అదే వేదికగా చేసుకొని మరికొందరు రైతులు తమ సమస్యలను గురువారం పోస్ట్ చేశారు. అలాగే సీఎం మొదటి రోజు స్పందించిన మంచిర్యాల జిల్లా నందులపల్లి రైతు శరత్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. శరత్ తండ్రి శంకరయ్య దాయాదుల కుటుంబానికి చెందిన జ్యోతి అనే యువతి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ఫిర్యాదు చేసింది. శరత్ చెప్పిందే నిజమని నమ్మి ఏకపక్షంగా తమ భూమిని అతని కుటుంబానికి పట్టా సర్ట్ఫికేట్ జారీ చేయడం అన్యాయమని జ్యోతి వాపోయింది. సదరు ఏడు ఎకరాల భూమిని తమ కుటుంబం 50 ఏళ్లుగా సాగు చేసుకుంటుందని పేర్కొంది. ఆ భూమిపై శంకరయ్య ఒక్కరికే హక్కు లేదని, అందులో తమ కుటుంబానికి కూడా వాటా ఉందని జ్యోతి పేర్కొంది.
కొత్త మలుపు తిరుగుతున్న శరత్ స్టోరీ
తాము కోటిశ్వర్లమని, హైదరాబాద్‌లో ఉంటున్నామని చెప్పింది కూడా వాస్తవం కాదని ఖండించింది. రైతుబంధు పథకం కింద తాము పంట సహాయాన్ని పొందినట్టు చేసిన ఆరోపణ కూడా అబద్ధమేనని గుర్తు చేసింది. అధికారులు రికార్డులు పరిశీలించి తాము రైతుబంధు సహాయాన్ని తీసుకున్నట్టు నిరూపిస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమేనని జ్యోతి స్పష్టం చేసింది. ఫేసుబుక్‌లో జ్యోతి పోస్టింగ్‌పై కూడా సీఎం కార్యాలయం స్పందించి మంచిర్యాల జిల్లా కలక్టర్ భారతీ హోళికేరిని నివేదిక పంపించాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. ఇలా ఉండగా తాజాగా గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచిక్కోడ్ గ్రామ రైతులు తమ భూ సమస్యపైనా సోషల్ మీడియా ద్వారా సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా స్పందించిన సీఎం కేసీఆర్ సిద్దిపేట కలక్టర్ కృష్ణ భాస్కర్‌తో ఫోన్లో స్వయంగా మాట్లాడారు. రైతుల ఫిర్యాదుపై విచారణ జరిపి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం ఆదేశించారు. భూ ప్రక్షాళన సందర్భంగా భూ రికార్డులను సరిదిద్దడంలో క్షేత్రస్థాయి రెవిన్యూ సిబ్బంది అవినీతి, అక్రమాల వల్ల అమాయక రైతులు గగ్గోలు చెందుతున్న ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యాలయానికి కుప్పలు తెప్పలుగా వచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. రికార్డులు సరిదిద్దడంలో రెవిన్యూ సిబ్బంది చేతివాటంపైనే ఎక్కువగా ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. దీనిని తీవ్రంగా పరిగణించి సీఎం కేసీఆర్ జరిగిన తప్పిదాలను సరిదిద్దడంతో పాటు దీనిపై అన్ని జిల్లాల కలక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు