సిద్దిపేట, మార్చి 25 (way2newstv.com)
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులోని జిల్లా పరిషత్తు హై స్కూల్ బాల వికాస్ లైన్లో ప్రశాంత్ నగర్ పరిధిలో మోరిలు నిండి మురికి నీరు ఇంట్లోకి వస్తున్నయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మురికి నీరుతో చాల ఇబ్బంది పడుతున్నప్పటికిని ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
పట్టించుకునే వారులేక నిండిపారుతున్న మురుగుకాల్వలు
ఈ మోరీలను శుభ్రం చేసీ కాలనీ వాసుల్ని ఇబ్బందుల బారినుండీ కాపాడాలని సంబంధించిన శాఖ అధికారులను, పాలక వర్గాన్ని కోరుతున్న వార్డు ప్రజలు కోరుతున్నారు. త్వరగా మోరీలను శుభ్రం చేసి ప్రజలను వ్యాధుల బారినుండి కాపాడాలని టిజేఏసీసిద్దిపేట జిల్లా కో -ఆర్డినేటర్ తోడుపునురి వేంకటేశం డిమాండ్ చేశారు.