ప్రధాని మోదీ హిట్లర్‌ : కేజ్రీవాల్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రధాని మోదీ హిట్లర్‌ : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ మార్చి 23, (way2newstv.com
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోదీని హిట్లర్‌తో పోలుస్తూ విమర్శలు చేశారు. హిట్లర్‌ తరహాలోనే మోదీ కూడా విమర్శకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘హిట్లర్‌ పాలనలో గూండాలు అమాయక ప్రజలను హింసించి చంపేవారు. అనేక మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసేవారు. మోదీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. 


 ప్రధాని మోదీ హిట్లర్‌ :  కేజ్రీవాల్‌

అధికారం కోసం హిట్లర్‌ సిద్ధాంతాలను పాటిస్తున్నారు. కానీ అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మోదీ అనుచరులకు అర్థం కావడం లేదు’’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ మైనారిటీ కుటుంబంపై కొంత మంది దాడి చేశారని వస్తున్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు. ‘ఇలాంటి దాడులు చేయాలని ఏ గీత చెబుతుంది? ఏ రామాయణంలో రాసుంది?’ అని ప్రశ్నించారు.