సూర్యాపేట,మార్చి 29, (way2newstv.com)
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రధాని కావడం ఖాయమని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ లో జరగనున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు.
రాహుల్ ప్రధాని కావడం ఖాయం
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమి అత్యధిక స్థానాలు సాధించి రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పారన్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రానున్నాయని ఉత్తమ్ అన్నారు. తెరాసకు దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు ఇస్తారని అయన అన్నారు.