కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతమొందించడానికే మోదీ సైన్యంలో చేరా

భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణ
మహబూబ్‌నగర్‌ మార్చ్ 29 (way2newstv.com)
పాలమూరులో పుట్టి పెరిగిన తాను ఈ ప్రాంతం అభివృద్ధికి అహర్నిశలు తాపత్రయ పడ్డానని భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో తెరాసను ఎదుర్కొనేందుకు, కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతమొందించడానికే తాను మోదీ సైన్యంలో ఓ సైనికురాలిగా చేరానన్నారు. శుక్రవారం పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారతదేశంలో తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. 


కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతమొందించడానికే మోదీ సైన్యంలో చేరా

ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ అమిస్తాన్‌పూర్‌లోని భూత్పూర్‌ ఐటీఐ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మోదీ ఓ బలమైన నాయకుడిగా నిలిచారని,  ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారని కొనియాడారు. దేశ ప్రజలంతా మోదీవైపే చూస్తున్న తరుణంలో పాలమూరు ఎంపీ స్థానాన్ని గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలని డీకే అరుణ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాజపా నేతలు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, డీకే అరుణ, బంగారు శ్రుతి, జితేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post