రోస్ట‌ర్ విధానం ప్ర‌కారం.. కాలేజీలు, వ‌ర్సిటీల్లో నియామ‌కాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోస్ట‌ర్ విధానం ప్ర‌కారం.. కాలేజీలు, వ‌ర్సిటీల్లో నియామ‌కాలు

కేంద్రం ప్రభుత్వం వెల్ల‌డి
న్యూ డిల్లీ మార్చ్ 7 (way2newstv.com)   
దేశ‌వ్యాప్తంగా టీచ‌ర్ల‌కు శుభ‌వార్త‌. 200 పాయింట్ రోస్ట‌ర్ విధానం ప్ర‌కారం.. కాలేజీలువ‌ర్సిటీల్లో నియామ‌కాలు ఉంటాయ‌ని ఇవాళ కేంద్రం వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ ప‌చ్చ‌జెండా ఊపింది. రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కార‌మే నియామ‌కాలు ఉంటాయ‌ని ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విద్యా సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్ రోస్ట‌ర్‌ను పాటించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఇటీవ‌ల కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 


రోస్ట‌ర్ విధానం ప్ర‌కారం.. కాలేజీలు, వ‌ర్సిటీల్లో నియామ‌కాలు

13 పాయింట్ రోస్ట‌ర్ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. 200 పాయింట్ రోస్ట‌ర్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని టీచ‌ర్లు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆర్డినెన్స్‌తో సుమారు 5 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఉన్న‌త విద్య‌లో విద్యాప్ర‌మాణాలు కూడా మెరుగుప‌డ‌నున్నాయని కేంద్రం త‌న ట్వీట్‌లో వెల్ల‌డించింది.కాగా విశ్వవిద్యాలయాలు యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీ అధ్యాపక పోస్టులను రిజర్వ్‌ చేస్తూ ఒకటి రెండు రోజుల్లో ఆర్డినెన్స్‌ జారీ చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌ ప్రకటించారు.